జిల్లా టాపర్‌కు ఆర్థిక చేయూత
గోవిందరావుపేట: ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా టాపర్‌గా నిలిచిన డి.కారుణ్యకి జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ నియంత్రణ అధికారి జయదేవ్ నగదు ప్రోత్సాహాకాన్ని ఆందజేశారు. మండల పరిధిలోని చల్వాయికి చెందిన కారుణ్య గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివి జిల్లాలోనే 577మార్కులు సాధించి జిల్లా టాపర్ గా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యున్నత మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచి జిల్లా పేరుని నిలబెట్టడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచినందుకు కారుణ్యకు శాలువా కప్పి ప్రోత్సాహకంగా రూ.10వేలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లారెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమ్మయ్య, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


