బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోu
అమల్లోకి భూభారతి చట్టం
● పైలెట్ ప్రాజెక్టుగా వెంకటాపురం(ఎం) మండలం ఎంపిక
● భూ సమస్యల పరిష్కారంపై చిగురిస్తున్న ఆశలు
● ధరణితో నష్టపోయామంటున్న రైతులు
ములుగు/వెంకటాపురం(ఎం): బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం నూతన విధివిధానాలతో భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో నాలుగు మండలాలను పైలెట్ మండలాలుగా ఎంపిక చేయగా అందులో జిల్లాలోని వెంకటాపురం(ఎం) మండలం ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న భూ సమస్యలు భూభారతితోనైనా పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రం ప్రభుత్వం అందించిన విధివిధానాలను ప్రజలకు అవగాహన కల్పించేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 17నుంచి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి, రైతుల అభిప్రాయాలను సేకరించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు పర్యటించి భూసమస్యలకు పరిష్కారం చూపనున్నారు.
ఐదేళ్లుగా తిరుగుతున్నా..
మండల కేంద్రం శివారులో ఎకరం భూమి తాతల కాలం నుంచి మాకు ఉంది. కాస్తుల్లో ఉన్నప్పటికీ పట్టా లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదు. సాగు చేసుకుంటున్న భూమికి పట్టా కావాలని ఐదేళ్లుగా తహసీ ల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం. డీఎస్ పెండింగ్‌లో ఉంద ని, ధరణిలో పట్టా చేసే ఆప్షన్ లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నా రు. భూభారతి చట్టంతోనైనా రెవెన్యూ అధికారులు పట్టా అందించాలి.
– నాగెల్లి శ్రీధర్‌రెడ్డి, వెంకటాపురం(ఎం)
చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం
భూ భారతి కింద వెంకటాపురం(ఎం) మండలం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై ంది. రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తాం. భూభారతి ద్వారా రైతుల సమస్యలను పరిష్కరిస్తాం. పరిష్కారం కాని సమస్యలను ప్రభుత్వానికి నివేదిస్తాం. భూ సమస్యలు ఉన్న రైతులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. బుధవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి పకడ్బందీగా భూ భారతిని అమలు చేస్తాం.
– టీఎస్.దివాకర, కలెక్టర్
వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని 23గ్రామ పంచాయతీల పరిధిలో 74,667 ఎకరాల సాగు భూములు ఉన్నాయి. 13,530మంది రైతులు మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్నారు. మండలంలో చాలామంది రైతులు కాస్తులో ఉన్నప్పటికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ధరణితో అందలేదు. పట్టాదార్ పాస్ పుస్తకాలు కావాలని రైతులు ఎన్నిసార్లు తహసీల్దార్‌కు మొరపెట్టుకున్నా ధరణిలో ఆప్షన్ లేకపోవడంతో రైతులకు న్యాయం జరగలేదు. భూభారతి చట్టంతో కాస్తులో ఉన్న రైతులందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
ఆరుసార్లు దరఖాస్తు
చేసుకున్నా..
వెంకటాపురం మండల కేంద్ర శివారులో సర్వే నంబర్ 234లో నాలుగు ఎకరాల భూమి ఉండగా 2,7ఎకరాల భూమి మాత్రమే రికార్డుల్లో ఎక్కింది. మిగిలిన భూమిని రికార్డుల్లోకి ఎక్కించాలని అధికారులకు ఆరుసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు మోక్షం కలగలేదు. సాదాబైనామాలో దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. భూభారతి చట్టం అమలులోకి వచ్చిన క్రమంలో మండలాన్ని పైలెట్ మండలంగా ప్రకటించడంతో రికార్డుల్లో లేని భూములకు పట్టా హక్కులు కల్పించి రైతాంగాన్ని ఆదుకోవాలి.
– పంబిడి శ్రీధర్‌రావు,
వెంకటాపురం(ఎం)
●
అసైన్డ్ భూములుకు
హక్కులు కల్పించాలి
మండల పరిధిలో సుమారుగా 10వేల ఎకరాలకు పైగా అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి భూములను కొనుగోలు చేసి సాగు చేస్తున్న రైతులకు ఇప్పటివరకు హక్కులు కల్పించలేదు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం చుట్టూ ఉన్న భూములతో పాటు వెంకటాపురం, లక్ష్మీదేవిపేట, రామాంజాపూర్ గ్రామాల్లో అసైన్డ్ భూములే అధికంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటికీ అమలులోకి రాలేదు. ములుగు సబ్ కలెక్టర్‌గా పనిచేసిన గౌతమ్ అసైన్డ్ భూములు కొనుగోలు చేసి కాస్తులో ఉన్న 5 ఎకరాలలోపు రైతులందరికీ కులమత భేదం లేకుండా రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాల వరకు జాకారం భూములతో పాటు ఇతర గ్రామాల్లో కాస్తులో ఉన్నవారికి రీ అసైన్డ్ చేశారు. అదేవిధంగా అసైన్డ్ భూములను కొనుగోలు చేసి కాస్తులో ఉండి మోకా మీద ఉన్న వారికి రీ అసైన్డ్ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
న్యూస్‌రీల్
మండలంలో
74,667ఎకరాలు
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
బుధవారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025


