అగ్ని ప్రమాదాలకు చెక్
టోల్ ఫ్రీ నంబర్ 101కి ఫోన్ చేస్తే అందుబాటులోకి వస్తాం..
విస్తృత అవగాహన
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చాలా గ్రామాలు, అడవుల్లో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలో అగ్ని ప్రమాదాలు చోటు సంభవించినప్పుడు ఏ విధంగా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే కోణంలో నేటి (సోమవారం) నుంచి 20వ తేదీ వరకు జరగనున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆయా గ్రామాల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించనున్నారు. ఇందులో ముఖ్యంగా గృహాల్లోని ఆల్మారాలు, సెల్ఫ్‌లను సక్రమంగా ఉంచుకోవడం, చిన్నపిల్లలకు అగ్గిపెట్టెలు, లైటర్లు, బాణసంచా అందుబాటులో లేకుండా చేయడం, కాల్చిన సిగరేట్లు, బీడీలు, అగ్గిపుల్లలను అందుబాటులో ఉంచకుండా చూడడం, వంట గదిలో వెలుతురు ఉండేలా చూసుకోవడం, గ్యాస్ లీకేజీ కాకుండా తీసుకునే జాగ్రత్తలు, స్కూల్స్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్‌లో ఫైర్ అలారం, ఫైర్ స్మోక్ డిటెక్టర్లను అవసరమైన చోట ఏర్పాట్లు చేయడం, సెల్లార్లలో ఆటోమేటిక్ స్ప్రింక్లర్లు ఉపయోగించడం, అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే రెండో దారి ద్వారా బయటికి రావడం వంటి అంశాలపై ప్రజలకు స్వయం ప్రదర్శన చేయనున్నారు.
● ప్రజలకు అగ్ని మాపకశాఖ తరఫున అవగాహన
● నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు
● జిల్లాలో ములుగు, ఏటూరునాగారంలో స్టేషన్లు
● ఇబ్బంది పెడుతున్న సిబ్బంది కొరత
ములుగు: వేసవిలో సంభవించే అగ్ని ప్రమాదాలతో ఆందోళన చెందకండి.. కాస్త కుదుటపడి 101 టోల్‌ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేయండి.. సకాలంలో వివరాలు అందిస్తే కొద్ది సమయంలోనే అందుబాటులోకి వస్తాం.. జరిగే నష్టాన్ని మా వంతుగా కొంతమేర ఆపగలుగుతాం అంటున్నారు.. అగ్ని మాపకశాఖ అధికారులు, సిబ్బంది. ‘అగ్ని సురక్షిత భారతదేశాన్ని ప్రజ్వలించడానికి ఏకం కండి’ అనే థీమ్‌తో ఈ ఏడాది వారోత్సవాల నిర్వహణకు అగ్రిమాపక శాఖ తరఫున ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ములుగు, ఏటూరునాగారం కేంద్రాల్లో ఫైర్ స్టేషన్లు ఉండగా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై తగిన కసరత్తు చేసి సిద్ధంగా ఉన్నట్లుగా ములుగు ఫైర్‌స్టేషన్ అధికారి కె.కుమారస్వామి తెలిపారు.
ఫైర్ అధికారులు, కార్యాలయాల ఫోన్ నంబర్లు
అగ్ని ప్రమాదాలకు చెక్


