నేను ప్రెగ్నెంట్‌ కాదు: బాలీవుట్‌ నటి

Yuvika Chaudhary Denies Pregnancy Rumours - Sakshi

నవంబర్‌ 4న కర్వా చౌత్‌ వేడుకల సందర్భంగా బయటకు వచ్చిన బిగ్‌బాస్ ఫేం ప్రిన్స్‌ నరులా, యువికా చౌదరి ఫోటోగ్రాఫర్ల కంటపడ్డారు. యువికా కారు నుంచి దిగి వస్తుండగా భర్త ప్రిన్స్‌ ఆమెను చేయి పట్టుకొని ప్రేమగా తీసుకొచ్చాడు.ఈ వీడియోలో యువికా పింక్‌ కలర్‌ దుప్పట కలిగిన అనార్కలి దుస్తులను ధరించారు. ఈ డ్రెస్‌ ఆమెకు కాస్తా వదులుగా ఉండటం, కారు నుంచి దిగగానే దుప్పటతో కవర్‌ చేయడంతో యువికా ప్రస్తుతం గర్భవతి అని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవ్వడంతో తాజాగా నటి స్పందించారు. తను గర్భవతినని వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. ఇటీవల ఆమె కరోనా బారినపడి కోలుకున్నట్లు పేర్కొన్నారు. డెంగ్యూ జ్వరం రావడం వల్ల ఆసుపత్రికి వెళ్లగా తనకు కోవిడ్‌ సోకినట్లు తేలిందన్నారు. అనారోగ్యం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, తప్పుడు వార్తలను సృష్టించవద్దని కోరారు. చదవండి: టాక్‌ షో హోస్ట్‌గా సమంత!

తన డ్రెస్సింగ్‌పై మాట్లాడుతూ.. ‘నేను ప్రెగ్నెంట్‌ కాదు. కానీ నాకు డిజైన్‌ కలిగిన దుపట్టా ఇష్టం. అందుకే దాన్ని ధరించాను. కానీ ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. వివాహం తర్వాత ప్రెగ్నెన్సీ గురించి చాలా ప్రశ్నలు వస్తున్నాయి. పిల్లలంటే నాకు చాలా ఇష్టం.  భవిష్యత్తులో ప్లాన్‌ చేసుకుంటాం. అది జరగాల్సిన సమయంలో తప్పక జరుగుతంది’ అని పేర్కొన్నారు. కాగా యువికా చౌదరి, ప్రిన్స్‌ నరులా 2015లో వచ్చిన హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 9 లో తొలిసారిగా కలుసుకున్నారు. అక్కడ ఏర్పడిన వారి పరిచయం ప్రేమకు దారితీసింది. హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక నిశ్చితార్థం చేసుకొని 2018లో వివాహం చేసుకున్నారు. ఈ రెండేళ్లలో తన జీవితం ఆనందంగా, సంతోషంగా గడిచిపోయిందని యువికా ఓ పోస్టు రూపంలో పేర్కొన్నారు. కాగా యువికా షారుక్‌ ఖాన్‌ నటించిన ఓం శాంతి ఓం సినిమాలో నటించారు. చదవండి: ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన నటి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top