Young Hero Vishwak Sen Reacts On Senior Actor Arjun - Sakshi
Sakshi News home page

Vishwak Sen: అర్జున్ వ్యాఖ్యలపై స్పందించిన విశ్వక్‌సేన్‌ సిబ్బంది.. ఏమన్నారంటే..!

Nov 5 2022 7:08 PM | Updated on Nov 5 2022 9:29 PM

Young Hero Vishwak Sen Reacts On Senior Actor Arjun - Sakshi

సీనియర్ నటుడు అర్జున్, యంగ్ హీరో విశ్వక్ సేన్ మధ్య వివాదం మరింత ముదిరింది. దీనిపై తాజాగా అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించిన విశ్వక్‌సేన్‌పై ఫైర్‌ అయ్యారు. అతను అన్‌ప్రొఫెషనల్ నటుడు అంటూ ఆయన మండిపడ్డారు. అతనికి ఎలాంటి నిబద్ధత లేదంటూ అర్జున్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనలా మరొకరికి జరగకుండా  ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు అర్జున్ తెలిపారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై విశ్వక్ సేన్ సిబ్బంది  స్పందించారు.

(చదవండి: చాలా సార్లు కాల్‌ చేశా.. పట్టించుకోలేదు: విశ్వక్‌సేన్‌పై అర్జున్‌ ఫైర్‌)

కథ విషయంలో కొన్ని మార్పులపై విశ్వక్ సేన్ కొన్ని సూచనలు చేసిన మాట వాస్తవమేనని ఆయన సిబ్బంది తెలిపారు. కథలో ఆసక్తికరంగా ఉండే చిన్న చిన్న మార్పులకు అర్జున్‌ ఒప్పుకోవడం లేదని అన్నారు. అంతా తాను చెప్పినట్లే నడుచుకోవాలని.. విశ్వక్ సేన్ మాటకు సెట్‌లో గౌరవం ఇవ్వలేదని సిబ్బంది తెలిపారు. అందుకే మనసుకు నచ్చని పని  చేయలేక సినిమా నుంచి తప్పుకున్నారని వివరించారు. తాజాగా సినిమాకు సంబంధించిన ఒప్పంద పత్రాలు  నిర్మాతల మండలికి పంపినట్లు విశ్వక్ సేన్ సిబ్బంది తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై విశ్వక్ సేన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement