Yashoda Movie Director Hari Shankar, Harish Narayan About Samantha - Sakshi
Sakshi News home page

Yashoda Movie Directors: సమంత గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ‘యశోద’ డైరెక్టర్స్‌

Jul 12 2022 3:35 PM | Updated on Jul 12 2022 4:06 PM

Yashoda Movie Director Hari Shankar Harish Narayan About Samantha - Sakshi

సమంత తొలి పాన్‌ ఇండియా మూవీ యశోద షూటింగ్‌ పూర్తయిందని, ఒక్క పాట మాత్రమే మిగిలుందని తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. శ్రీదేవీ మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి హరి-హరీశ్‌లో ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ దర్శకులు ఇటీవల ఓ అంగ్ల మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు చిత్ర విశేషాలతో పాటు సమంత గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

చదవండి: స్కూల్లో ఓ అబ్బాయికి లవ్‌ లేటర్‌ రాశా, అది ఇంట్లో తెలిసింది..: సాయి పల్లవి

రోటిన్‌గా కాకుండా ప్రేక్షకులకు వినోదపరిచేందుకు విభిన్న కథ రావాలనుకున్నాం. అందుకే చాలా గ్యాప్‌ తీసుకున్నాం. యశోద మూవీకి విభిన్న కథానాలను అర్థం చేసుకునే హీరోయిన్‌ కావాలనుకున్నాం. అందుకేఈ  సినిమా కోసం సమంతను సంప్రదించాం. కథ విన్న వెంటనే ఆమె ఓకే చెప్పారు’ అని చెప్పారు. కాగా ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌కు ముందే సమంతకు ఈ కథ వివరించామన్నారు. ఇక కథ వింటుంటే తనకు గూస్‌ బంప్స్‌ వస్తున్నాయని, తప్పకుండా తాను ఈ సినిమా చేస్తానని సమంత మాట ఇచ్చినట్లు తెలిపారు.

చదవండి: కోల్‌కతా థియేటర్లో ‘రాకెట్రీ’ ప్రదర్శన నిలిపివేత.. ఫ్యాన్స్‌కి మాధవన్‌ విజ్ఞప్తి

అంతేకాకుండా యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కించేందుకు ఎలాంటి సహాయం తీసుకోవడానికి కూడా సమంత ఇష్టపడేలేదన్నారు. ‘సినిమాలోనే మెయిన్‌ యాక్షన్‌ సీన్స్‌ను సెట్‌లోనే చిత్రీకరించాం. అయితే కొన్ని ఫైట్‌ సీన్స్‌ రిహార్సల్స్‌ కోసం సమంత 2, 3 రోజులు సెట్‌లోనే ఉన్నారు. ఎందుకంటే ఫైట్‌ సన్నివేశాలను తానే స్వయంగా చేయాలనుకుంది. ఎవరి సహాయం లేకుండానే సమంత యాక్షన్‌ సీన్స్‌ చేశారు’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్‌ యాన్నిక్‌ బెన్‌, వెంకట్‌ మాస్టర్లు ఈ మూవీకి పని చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement