కేజీఎఫ్ స్టార్ యశ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ టాక్సిక్. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. యశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా మెప్పించింది.
అయితే ఈ మూవీ రిలీజై నెల రోజులు దాటినా ఇప్పటి వరకు ఓటీటీకి రాలేదు. థియేటర్ రెస్పాన్స్ చూశాక ఓటీటీలు సైతం ఈ చిత్రంపై వెనకడుగు వేస్తున్నాయి. ఇప్పుడు టాక్సిక్ ఓటీటీ డీల్‌కు సంబంధించి ఓ క్రేజీ టాక్ వైరలవుతోంది. ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చేసరికి ఓటీటీ డీల్ ఆఫర్ తగ్గిపోయిందని తెలుస్తోంది. మొదట రూ.200 కోట్లకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. అయితే థియేటర్ రెస్పాన్స్ తర్వాత ఏకంగా రూ.30 కోట్లకు పడిపోయినట్లు సమాచారం.
కానీ ఇప్పుడు ఆ రూ.30 కోట్లు వెచ్చించలేమని ఓటీటీలు ముందుకు రావడం లేదని టాక్. కాగా.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ జీ5 సొంతం చేసుకుందని గతంలో రూమర్స్ వినిపించాయి. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ లెక్కన చూస్తే అసలు టాక్సిక్ ఓటీటీకి వస్తుందా? లేదా? అనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. చివరికీ ఈ సినిమా ఓటీటీలో వస్తుందో మరికొద్ది రోజులు ఆగితే కానీ చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లోనైనా క్లారిటీ వస్తుందో లేదో వేచి చూడాల్సిందే.


