క్రికెటర్‌ని కావాలనుకున్నాను కానీ.. | Yash Puri Talk About Cheppalani Vundi Movie | Sakshi
Sakshi News home page

క్రికెటర్‌ని కావాలనుకున్నాను కానీ..

Dec 8 2022 8:24 AM | Updated on Dec 8 2022 8:26 AM

Yash Puri Talk About Cheppalani Vundi Movie - Sakshi

‘‘చెప్పాలని ఉంది’ సినిమాలో కథే పెద్ద హీరో. కథ బావుంటే ఆదరించడానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారు. ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో మా ‘చెప్పాలని ఉంది’ మొదటి రెండు స్థానాల్లో ఉంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు యష్‌ పూరి. అరుణ్‌ భారతి. ఎల్‌ దర్శకత్వంలో యష్‌ పూరి, స్టెఫీ పటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘చెప్పాలని ఉంది’. ఆర్బీ చౌదరి సమర్పణలో వాకాడ అంజన్‌ కుమార్, యోగేష్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదల కానుంది.

ఈ సందర్భంగా యష్‌ పూరి మాట్లాడుతూ– ‘‘నేను క్రికెటర్‌ని కావాలని కల కన్నాను. హైదరాబాద్‌ రంజీ ట్రోఫీ ప్రాబబుల్స్‌ వరకూ వెళ్లాను. అయితే కొన్ని కారణాల వల్ల క్రికెట్‌ వదిలి, సినిమాతో ప్రేమలో పడ్డా. ఓ రకంగా నాకు అల్లు అర్జున్‌గారే స్ఫూర్తి. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన ‘అలనాటి సిత్రాలు’లో నాకు తొలి చాన్స్‌ వచి్చంది. ఇప్పుడు సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌లో ‘చెప్పాలని ఉంది’తో సోలో హీరోగా లాంచ్‌ కావడం నా లక్‌. ఇందులో జర్నలిస్ట్‌ చంద్ర శేఖర్‌ పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమా చేశాక మీడియా మీద మరింత గౌరవం పెరిగింది’’ అన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement