WWW Movie: కన్నులు చెదిరే అందం సాంగ్‌ రిలీజ్‌ | WWW Movie: Kannulu Chedire Song Released | Sakshi
Sakshi News home page

WWW Movie: కన్నులు చెదిరే అందం సాంగ్‌ రిలీజ్‌

May 30 2021 10:54 AM | Updated on May 30 2021 10:54 AM

WWW Movie: Kannulu Chedire Song Released - Sakshi

'కన్నులు చెదిరే అందాన్ని వెన్నెల తెరపై చూశానే..' లిరికల్‌ సాంగ్‌ వీడియోను హీరో అడివి శేష్‌ విడుదల చేశాడు. ఈ పాటను అనంత శ్రీరామ్‌ రాయగా, యాసిమ్‌ నిజార్‌ ఆలపించారు...

అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (ఎవరు? ఎక్కడ? ఎందుకు?). ‘118’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవి గుహన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. రవి పి రాజుదాట్ల నిర్మించిన ఈ చిత్రానికి విజయ్‌ ధరణ్‌ దాట్ల సహనిర్మాత.

ఈ చిత్రంలోని 'కన్నులు చెదిరే అందాన్ని వెన్నెల తెరపై చూశానే..' లిరికల్‌ సాంగ్‌ వీడియోను హీరో అడివి శేష్‌ విడుదల చేశాడు. ఈ పాటను అనంత శ్రీరామ్‌ రాయగా, యాసిమ్‌ నిజార్‌ ఆలపించారు. సైమన్‌ కె సింగ్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నాం. థ్రిల్లర్‌ జానర్‌లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఓ విభిన్నమైన చిత్రంగా నిలుస్తుందని కేవీ గుహన్‌ పేర్కొన్నాడు.. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు.

చదవండి: Shah Rukh Khan: ఓటీటీలోకి బాలీవుడ్‌ బాద్‌షా!

Advertisement
 
Advertisement
Advertisement