ఓటీటీ: ఈ వారం కొత్త సరుకు, ఓ లుక్కేయండి

This Week Upcoming Movies Releasing List On OTT - Sakshi

ఇప్పటివరకు బుల్లితెర, వెండితెర అని రెండు మాత్రమే ఉండేది. కానీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఎంట్రీతో డిజిటల్‌ తెర కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. యూత్‌ మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుంటోన్న డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ కొత్త, పాత కంటెంట్‌ను అందిస్తూ ఇచట అన్ని రకాల ఎంటర్‌టైన్‌మెంట్‌ దొరుకును అని గ్యారెంటీ ఇస్తున్నాయి. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం..

కోల్డ్‌ కేస్‌
పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అదితి బాలన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కోల్డ్‌ కేస్‌. తను బాలక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో జూన్‌ 30న రిలీజ్‌ కానుంది.

హసీన్‌ దిల్‌రుబా
తాప్సీ పన్ను, విక్రాంత్‌ మాస్సే, హర్షవర్ధన్‌ రానే ముఖ్యపాత్రల్లో నటించిన మూవీ హసీన్‌ దిల్‌రుబా. వినిల్‌ మాథ్యూ డైరెక్షన్‌ చేసిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 2న విడుదల కానుంది.

ద టుమారో వార్‌
క్రిస్‌ ప్రాట్‌, వోనె స్ట్రాహోవ్‌స్కీ, జేకే సిమ్మన్స్‌, బెట్టీ గిల్పిన్‌ కీలక పాత్రల్లో నటించిన సినిమా ద టుమారో వార్‌. క్రిస్‌ మెకే దర్శకత్వం వహించిన ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో జూలై 2 నుంచి అందుబాటులోకి రానుంది.

సమంతార్‌ సీజన్‌ 2
తేజస్విని పండిట్‌, సాయి టామ్‌హంకర్‌, స్వాప్నిల్‌ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ సమంతార్‌ సీజన్‌ 2. సతీష్‌ రాజ్వడే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ జూలై 2 నుంచి ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లోకి అందుబాటులోకి రానుంది.

ఫియర్‌ స్ట్రీట్‌ పార్ట్‌ 1
కియానా మడేరియా, ఒలీవియా స్కాట్‌, బెంజిమన్‌ ఫ్లోర్స్‌ జూనియర్‌ నటించిన చిత్రం ఫియర్‌ స్ట్రీట్‌ పార్ట్‌ వన్‌: 1994. లై జనైక్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 2న విడుదల కానుంది.

బిగ్‌ టింబర్‌ సీజన్‌ 1
కెవిన్‌ వెన్‌స్టాబ్‌, ఎరిక్‌ వెన్‌స్టాబ్‌, సారా ఫ్లెమింగ్‌ ముఖ్యపాత్రల్లో యాక్ట్‌ చేసిన వెబ్‌ సిరీస్‌ బిగ్‌ టింబర్‌ సీజన్‌ 17. క్రిస్ట వెర్నాఫ్‌ రన్‌ చేస్తున్న ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 3 నుంచి ప్రసారం కానుంది.

గ్రేస్‌ అనాటమీ సీజన్‌ 17
ఎలెన్‌ పాంపియో, చంద్ర విల్‌సన్‌, జేమ్స్‌ పికెన్స్‌ నటించిన వెబ్‌సిరీస్‌ గ్రేస్‌ అనాటమీ. క్రిష్టా వెర్నాఫ్‌ రన్‌ చేస్తున్న ఈ సిరీస్‌ 17వ సీజన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 3 నుంచి స్ట్రీమింగ్‌ అవనుంది.

చుట్జ్‌పా
వరుణ్‌ శర్మ, మంజోత్‌ సింగ్‌, ఎల్నాజ్‌ నోరోజి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ చుట్జ్‌పా. మృగ్‌దీప్‌ లంబా రూపందించిన ఈ సిరీస్‌ సోనీ లైవ్‌లో జూలై 3 నుంచి ప్రసారం కానుంది.

చదవండి: డబ్బింగ్‌ కోసం సుధీర్‌బాబు ఎంత కష్టపడుతున్నారో చూడండి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top