ఈ సినిమాలు చూస్తే రూ.71 వేలు+ ప్రైమ్‌ వోచర్+ టికెట్ డబ్బులు‌‌

Website Offering 1,000 Dollars To Watch All 24 James Bond Films - Sakshi

జేమ్స్‌బాండ్‌ సినిమాలంటే మీకు ఇష్టమా? జేమ్స్‌ బాండ్‌ ఫ్రాంచైజీలో వచ్చిన అన్ని సినిమాలను మీరు ఇప్పటికే చూసేశారా? పోనీ మరోసారి వాటన్నింటినీ చూసే ఇంట్రస్ట్‌ ఉందా? ఉంటే ఈ వార్త మీకోసమే..

జేమ్స్‌బాండ్‌ ఫస్ట్‌ పార్ట్‌ నుంచి ఇప్పటివరకు రిలీజైన 24 సినిమాలు అన్నీ చూస్తే వెయ్యి డాలర్లు ఇస్తామంటోంది నెర్డ్‌బియర్‌ అనే వెబ్‌సైట్‌. అయితే ఓ షరతు విధించింది. కేవలం 30 రోజుల్లోనే వాటన్నింటినీ వరుస పెట్టి చూసేయాలని మెలిక పెట్టింది. దీనికి గానూ వెయ్యి డాలర్లు అంటే 72 వేల రూపాయలు ఇస్తామని ఆఫరిచ్చింది. దీంతో పాటు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో సినిమాలు చూసేందుకు ఏడు వేల రూపాయల గిఫ్ట్‌ కార్డు, త్వరలో విడుదల కానున్న జేమ్స్‌బాండ్‌ 25వ సినిమా టికెట్‌ కొనుక్కునేందుకు మూడున్నర వేల రూపాయల విలువ చేసే ఏఎమ్‌సీ గిఫ్ట్‌ కార్డు సైతం ఇస్తామని బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇందుకోసం Nerd Bear- a nerd culture వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది. ఏప్రిల్‌ 16 దరఖాస్తులకు చివరి తేదీ. అయితే ఈ అవకాశం అందరికీ కాదండోయ్‌. కేవలం అమెరికా వాసులకు మాత్రమే!

కాగా జేమ్స్‌బాండ్‌ 25వ సినిమా 'నో టైమ్‌ టు డై' సెప్టెంబర్‌ 30న విడుదల కానుంది. నిజానికి ఈ సినిమా గతేడాది వేసవిలో థియేటర్లలోకి రావాల్సింది. కానీ కరోనా ప్రభావం వల్ల నవంబర్‌కు, ఆ తర్వాత ఏప్రిల్‌కు వాయిదా వేశారు. అయితే అప్పుడు కూడా కుదరకపోవడంతో చివరాఖరకు సెప్టెంబర్‌ 30న రిలీజ్‌ అవుతున్నట్లు వెల్లడించారు.

జేమ్స్‌బాండ్‌ 24 సినిమాల లిస్టు ఇదే..
1. Dr. No (1962)
2. From Russia with Love (1963)
3. Goldfinger (1964)
4. Thunderball (1965)
5. You Only Live Twice (1967)
6. On Her Majesty’s Secret Service (1969)
7. Diamonds Are Forever (1971)
8. Live and Let Die (1973)
9. The Man with the Golden Gun (1974)
10. The Spy Who Loved Me (1977)
11. Moonraker (1979)
12. For Your Eyes Only (1981)
13. Octopussy (1983)
14. A View to a Kill (1985)
15. The Living Daylights (1987)
16. Licence to Kill (1989)
17. GoldenEye (1995)
18. Tomorrow Never Dies (1997)
19. The World Is Not Enough (1999)
20. Die Another Day (2002)
21. Casino Royale (2006)
22. Quantum of Solace (2008)
23. Skyfall (2012)
24. Spectre (2015)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top