మార్చి 2న 'వ్యూహం' రిలీజ్.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ | Sakshi
Sakshi News home page

మార్చి 2న 'వ్యూహం' రిలీజ్.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Published Wed, Feb 28 2024 11:35 AM

Vyooham Movie Release Date And Censor Details - Sakshi

స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' విడుదలకు సిద్ధమైంది. మార్చి 2న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తొలుత ఫిబ్రవరి 25న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ సాంకేతిక సమస్యల కారణంగా మార్చి 1వ తేదీకి వాయిదా పడింది. ఇప్పుడు ఓ రోజు ఆలస్యంగా అంటే మార్చి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోను.. హీరోయిన్ ఆండ్రియా షాకింగ్ కామెంట్స్)

తాజాగా 'వ్యూహం' సినిమా విడుదలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. 'పట్టు వదలని విక్రమార్కుడిని' అని క్యాప్షన్‌తో పాటు సెన్సార్ సర్టిఫికెట్‌ని చేతిలో పట్టుకున‍్న ఫొటోని పోస్ట్ చేశారు. వాస్తవానికి రెండు నెలల క్రితమే 'వ్యూహం' రిలీజైపోవాలి. కానీ విడుదల నిలిపేయాని నారా లోకేష్.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో వాయిదా పడుతూ వచ్చింది. 

ఇప్పుడు అడ్డంకులన్నీ క్లియర్ అయిపోవడంతో 'వ్యూహం' సినిమా థియేటర్లలోకి రానుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. దీనికి 'శపథం' అని సీక్వెల్ కూడా త్వరలో రిలీజ్ కానుంది.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా)

Advertisement

తప్పక చదవండి

Advertisement