Viswasam Child Artist Anikha Surendran to Make Debut as Heroine - Sakshi
Sakshi News home page

Artist Anikha Surendran: హీరోయిన్‌ పరిచయం కాబోతున్న ‘విశ్వాసం’ బాలనటి అనిఖా

Dec 10 2022 9:07 AM | Updated on Dec 10 2022 3:36 PM

Viswasam Child Artist Anikha Surendran to Make Debut as Heroine - Sakshi

చైల్డ్‌ ఆర్టిస్ట్స్‌ హీరోయిన్లుగా అవతారం ఎత్తడం కొత్తేమీ కాదు. దివంగత నటి శ్రీదేవి నుంచి ఎందరో నటీమణులు కథానాయికులుగా రాణించారు. రాణిస్తూనే ఉన్నారు. ఆ కోవలో తాజాగా నటి అనిఖా సురేంద్రన్‌ చేరింది. ఈ కేరళ కుట్టి 2007లోనే బాలతారగా పరిచయమైంది. మలయాళం, తమిళం, తెలుగుభాషల్లో నటించి బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళంలో అజిత్‌ హీరోగా నటించిన ఎన్నై అరిందాల్‌ చిత్రంలో త్రిషకు కూతురుగానూ, విశ్వాసం చిత్రంలో అజిత్, నయనతార కూతురుగానూ నటించి బాగా పాపులర్‌ అయ్యింది.

కాగా 18వ ఏట అడుగుపెట్టిన అనిఖా హీరోయిన్‌గా అవకాశాలు కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. అందులో భాగంగా ఇటీవల సామాజిక మాధ్యమాలను బాగా వాడుకుంటోంది. తన గ్లామరస్‌ ఫొటోలను తరుచూ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ చిత్ర పరిశ్రమ దృష్టి తనపై పడేలా చేసుకోవడంలో సక్సెస్‌ అయ్యింది. అంతేకాదు జూనియర్‌ నయనతార అనే ముద్రవేసుకుంది. ఇప్పటికే మలయాళం, తెలుగు భాషల్లో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చేసింది. తెలుగులో బుట్టబొమ్మ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజాగా కోలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చింది. ఇక్కడ సంగీత దర్శకుడు, నటుడు హిప్‌ హాప్‌ తమిళాకు జతగా నటించనుంది. మీసై మురుక్కు చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన హిప్‌ హాప్‌ తమిళా ఆ తర్వాత నట్పేతునై, నాన్‌ సిరిత్తాల్, శివకుమారిన్‌ శపథం, అన్బరివు చిత్రాల్లో నటించారు. తాజాగా వెల్స్‌ ఫిలిమ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటి అనిఖా సురేంద్రన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ చిత్రానికి కార్తీక్‌ వేణుగోపాలన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

చదవండి: 
మహేశ్‌ బాబు భార్య నమ్రత కొత్త రెస్టారెంట్‌, రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..!
ఘనంగా నటి శ్రీవాణి గృహప్రవేశం వేడుక, నటీనటుల సందడి.. ఫొటో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement