
రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన 'హరిహర వీరమల్లు' ఫలితం ఏంటో అందరికీ తెలుసు. ఈ సినిమా సంగతి కాసేపు పక్కనబెడితే చిరంజీవి 'విశ్వంభర' గురించి కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అవి వింటుంటే అభిమానులకు నిరాశ తప్పదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అనుకున్న ప్లాన్‌లో మార్పులు జరుగుతున్నట్లు ఉన్నాయి. ఇంతకీ ఏంటి విషయం? 'విశ్వంభర' ఎప్పుడు థియేటర్లలోకి రావొచ్చు?
కొన్నిరోజుల క్రితం మీడియా ముందుకు వచ్చిన వశిష్ఠ.. చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. స్టోరీ ఏంటో చెప్పేయడంతో పాటు గ్రాఫిక్స్ లాంటి వాటి గురించి కూడా మాట్లాడారు. అలానే ఆగస్టు లేదా సెప్టెంబరులో రిలీజ్ ఉండొచ్చనట్లు హింట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే బ్యాలెన్స్ ఉన్న స్పెషల్ సాంగ్ షూటింగ్ శనివారంతో పూర్తయింది. దీంతో ఫ్యాన్స్.. 'విశ్వంభర' త్వరలో రిలీజ్ అయిపోతుందేమోనని సంతోషపడుతున్నారు. కానీ ప్లాన్ మారినట్లు కనిపిస్తుంది.
(ఇదీ చదవండి: 'మహావతార్ నరసింహా'కి హిట్ టాక్.. కలెక్షన్ ఎంతంటే?)
షూటింగ్ పూర్తయినా సరే వీఎఫ్ఎక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అవన్నీ అయిన తర్వాతే రిలీజ్ డేట్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం థియేటర్లలో ఉన్న 'హరిహర వీరమల్లు' విషయంలో మేజర్ కంప్లైంట్ గ్రాఫిక్సే. మరీ నాసిరకంగా ఉండటంతో తొలిరోజు నుంచి ఇప‍్పటికీ దారుణమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఇవన్నీ 'విశ్వంభర' టీమ్ చూస్తూనే ఉంటుంది. కాబట్టి కచ్చితంగా గ్రాఫిక్స్ విషయంలో అన్ని పనులు పూర్తయిన తర్వాత రిలీజ్ చేయడం బెటర్ అని అనుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే మూవీ రిలీజ్ డిసెంబరులోనే!
'విశ్వంభర' విషయానికొస్తే.. 14 లోకాలు అవతల ఉన్న హీరోయిన్‌ని తీసుకొచ్చేందుకు హీరో చేసే ప్రయత్నమే సినిమా స్టోరీ. ఇందులో చిరుకు జోడీగా త్రిష నటిస్తుండగా.. ఇషా చావ్లా, ఆషికా రంగనాథ్ లాంటి ముద్దుగుమ్మలు కూడా పలు పాత్రలు చేశారు. కీరవాణి సంగీత దర్శకుడు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‍తో నిర్మించింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఏమవుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: బేబీ బంప్‌తో తొలిసారి కనిపించిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి)