
ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చే సినిమాలు కొన్నిసార్లు అద్భుతాలు సృష్టిస్తుంటాయి. అలానే ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్ చేస్తుంటాయి. రెండు రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చిన 'మహావతార్ నరసింహా' మూవీ కూడా సేమ్ అలానే. ఎందుకంటే 'హరిహర వీరమల్లు'తో పాటు రిలీజై అదిరిపోయే టాక్ తెచ్చుకుంటుంది. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి.
కేజీఎఫ్, కాంతార, సలార్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేటెడ్ సినిమా 'మహావతార్ నరసింహా'. మనకు బాగా తెలిసిన విష్ణు అవతారాలు ఆధారంగా ఓ యూనివర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా రిలీజైన తొలి పార్ట్ ఇది. నరసింహా స్వామి అవతారం స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా అమితంగా నచ్చేస్తోంది.
(ఇదీ చదవండి: 'మహావతార్: నరసింహ' మూవీ రివ్యూ)
గత కొన్నాళ్ల నుంచి డివోషనల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ బాక్సాఫీస్ దగ్గర బాగానే వర్కౌట్ అవుతున్నాయి. ఆ అంశం కూడా 'మహావతార్ నరసింహా' చిత్రానికి బాగానే కలిసొచ్చింది. ఈ క్రమంలోనే రెండో రోజుల్లో రూ.4.6 కోట్ల కలెక్షన్ వచ్చినట్లు తెలుస్తోంది. అలానే గంటకు 13 వేలకు పైగా టికెట్స్ బుక్ మై షోలో సేల్ అవుతున్నాయి. దక్షిణాది సంగతి పక్కనబెడితే ఉత్తరాదిలోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. చూస్తుంటే ఈ యానిమేటెడ్ సినిమాలు అద్భుతాలు చేసేలా కనిపిస్తోంది.
సాధారణంగా మన దగ్గర యానిమేటెడ్ మూవీస్ పెద్దగా వర్కౌట్ కావు. గతంలో హనుమాన్ తదితర చిత్రాలు వచ్చాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా సరే వసూళ్లు రాలేదు. కానీ ఈ సినిమా మాత్రం కోట్ల రూపాయలు కలెక్షన్స్, అది కూడా పాన్ ఇండియా లెవల్లో అంటే గ్రేట్ అని చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: 'కింగ్డమ్' కోసం కొత్త విలన్.. ఇతడెవరో తెలుసా?)