
గత కొన్నేళ్ల నుంచి పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. అంటే ఒక భాషలో తీసిన సినిమా దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇతర భాషలకు చెందిన నటీనటులు.. తెలుగు ఇండస్ట్రీలోకి బోలెడంత మంది వస్తూనే ఉన్నారు. తాజాగా 'కింగ్డమ్' మూవీతో మలయాళం నుంచి మరో యువ నటుడు టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. తాజాగా రిలీజైన ట్రైలర్‌లో హైలైట్ అవ్వడంతోనే ఈ డిస్కషన్ వచ్చింది. ఇంతకీ ఎవరితడు?
'కింగ్డమ్' మూవీ అన్నదమ్ముల బ్యాక్ డ్రాప్లో శ్రీలంకలో జరిగే స్టోరీతో తెరకెక్కుతోంది. ట్రైలర్‌తోనే కథేంటి అనేది ఓ క్లారిటీ ఇచ్చేశారు. అయితే విజయ్ దేవరకొండ, సత్యదేవ్‌తో పాటు విలన్‌గా కనిపించిన ఓ నటుడు కూడా హైలైట్ అయ్యాడు. అతడి పేరు వెంకటేశ్ వీపీ. ట్రైలర్‌లో రెండు షాట్స్‌లోనే కనిపించాడు. ఇతడెవరా అని చూస్తే మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు అని తెలిసింది. 2014 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు.
(ఇదీ చదవండి: చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్ మధుప్రియ)
వెంకటేశ్.. మలయాళంలో సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేశాడు. ఒడియన్, వెలిపాడింటే పుస్తకం, తట్టుంపురత్ అచ్యుతన్ తదితర మూవీస్‌లో కనిపించాడు. తమిళంలో జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన 'రెబల్' చిత్రంలో విలన్‌గా చేశాడు. ఈ మూవీతోనే 'కింగ్డమ్' ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే టాలీవుడ్‍కి మరో కొత్త విలన్ దొరికాడేమో అనిపిస్తుంది.
మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. అనిరుధ్ సంగీతమందించగా.. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా ఉందని ఇదివరకే ప్రకటించారు. కాకపోతే తొలి భాగం ఫలితం బట్టి అది ఆధారపడి ఉంటుందేమో?
(ఇదీ చదవండి: ప్రతి 10 నిమిషాలకో ట్విస్ట్.. ఓటీటీ సినిమా రివ్యూ)