 
													అల్లరి నరేశ్ చాలారోజుల తర్వాత చేసిన కామెడీ సినిమా 'ఆ ఒక్కటి అడక్కు'. తండ్రి ఈవీవీ సత్యనారాయణ తీసిన మూవీ టైటిల్ కావడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే రెండు రోజుల్లో కలెక్షన్స్ బాగానే వచ్చాయి. చెప్పాలంటే తొలిరోజు కంటే రెండో రోజు ఎక్కువగానే వసూళ్లు రావడం విశేషం.
(ఇదీ చదవండి: సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య)
అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా 'ఆ ఒక్కటి అడక్కు'. పెళ్లి కాని అబ్బాయిల్ని.. మ్యాట్రిమోనీ వాళ్లు ఎలా మోసం చేస్తున్నారనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రంలో కామెడీ కంటే సీరియస్‌నెస్ ఎక్కువైంది. దీంతో మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినా సరే తొలిరోజు రూ.1.62 కోట్లు గ్రాస్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.
ఇక రెండో రోజు శనివారం.. వీకెండ్ అడ్వాంటేజ్ కావడంతో బాగానే వసూళ్లు వచ్చాయి. ఓవరాల్‌గా రెండు రోజుల్లో రూ.3.34 కోట్ల గ్రాస్ సొంతం చేసుకున్నట్లు మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేం కాబట్టి 'ఆ ఒక్కటి అడక్కు' చిత్రానికి వసూళ్లు పరంగా ఏమైనా ప్లస్ అవుతుందేమో అనేది చూడాలి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)
Silencing the hot summer with a COOL TREAT ❤️🔥#AaOkkatiAdakku collects 3.34CR Worldwide Gross in 2 days 🤘🏻
And it’s DAY 2 >>> Day 1 of Laughter madness ❤️🔥https://t.co/zbg0yxIPZx#SummerFunBlockbusterAOA@allarinaresh @fariaabdullah2 #VennelaKishore @harshachemudu… pic.twitter.com/0wx0dSmR1C— Ramesh Bala (@rameshlaus) May 5, 2024

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
