కొత్తవారితో విశ్వక్‌ సేన్‌ కల్ట్‌  | Sakshi
Sakshi News home page

కొత్తవారితో విశ్వక్‌ సేన్‌ కల్ట్‌ 

Published Sun, Dec 31 2023 12:59 AM

Vishwak Sen CULT to Introduce 20 Fresh Faces in Tollywood - Sakshi

సొంత నిర్మాణసంస్థలు వన్మయీ క్రియేషన్స్, విశ్వక్‌ సేన్‌ సినిమాస్‌లపై నటుడు–దర్శకుడు– రచయిత–నిర్మాత విశ్వక్‌ సేన్‌ ‘ఫలక్‌నుమాదాస్, దాస్‌ కా ధమ్కీ’ వంటి సినిమాలు చేశారు. అయితే ఈసారి కొత్తవారినిప్రోత్సహించాలని ‘హ్యాష్‌ట్యాగ్‌ కల్ట్‌’ అనే టైటిల్‌తో సినిమాను ప్రకటించారు. ‘సే నో టు డ్రగ్స్‌’ అనే స్లోగన్‌తో ఈ సినిమాకు ‘లైక్‌ ఏ లీప్‌ ఇయర్‌ 2024’ అనే క్యాప్షన్‌ పెట్టారు. విశ్వక్‌సేన్‌ కథ అందిస్తున్న ఈ సినిమాతో తాజుద్దీన్‌ దర్శకుడిగా పరిచయం కానున్నారు.

ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ –‘‘హ్యాష్‌ట్యాగ్‌ కల్ట్‌’ సినిమా హిలేరియస్‌గా ఉంటుంది. ఓ మంచి సందేశం కూడా ఉంది. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ఈ సినిమా కథ రాశాను. ఇందులో ముగ్గురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు లీడ్‌ రోల్స్‌ చేస్తారు. ఈ చిత్రంతో 25మంది కొత్త నటీనటులను పరిచయం చేయనున్నాం. ఔత్సాహికులు ప్రయత్నించవచ్చు. నాకు నటనలో కాన్ఫిడెన్స్‌ ఇచ్చిన తాజుద్దీన్‌గారు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు’’ అని అన్నారు. ‘‘విశ్వక్‌గారు ఈ సినిమా కథ చెప్పినప్పుడు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇది నాకు మొదటి సినిమా’’ అన్నారు తాజుద్దీన్‌.

 
Advertisement
 
Advertisement