బంగారం.. ఏమని చెప్పను.. ఐ లవ్‌ యూనే.. | Vishal and SJ Suryah Mark Antony Song Launch | Sakshi
Sakshi News home page

బంగారం.. ఏమని చెప్పను.. ఐ లవ్‌ యూనే..

Aug 26 2023 3:26 AM | Updated on Aug 26 2023 11:02 AM

Vishal and SJ Suryah Mark Antony Song Launch - Sakshi

విశాల్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మార్క్‌ ఆంటోని’. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్‌. ఎస్‌జే సూర్య, సునీల్, సెల్వ రాఘవన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్‌. వినోద్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్‌ 15న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఐ లవ్‌ యూ నే..’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను రామ్‌ మిరియాల పాడారు. ‘‘హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘మార్క్‌ ఆంటోని’. ఈ చిత్రంలో విశాల్‌ లుక్‌ సరికొత్తగా ఉంటుంది. ‘ఐ లవ్‌ యూ నే..’ పాటలో హీరోహీరోయిన్ల మాస్‌ స్టెప్స్, అందుకు తగ్గట్టుగా వస్తున్న ఫాస్ట్‌ బీట్‌ ఆకట్టుకుంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement