బావా, ఐ లవ్‌ యూ: మెగా హీరోకు ప్రేమలేఖ

Viral: Kakinada Sadhya Writes Letter To Charan I Love Ram Charan Bava - Sakshi

మెగా హీరోలను ఫాలో అయ్యే అభిమానులు చాలామందే. అందులోనూ యంగ్‌ హీరో రామ్‌ చరణ్‌కు ఫీమేల్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మరీ ఎక్కువ. ఇందుకు సోషల్‌ మీడియాలో వైరలవుతున్న ప్రేమలేఖ పెద్ద ఉదాహరణగా చెప్పవచ్చు. కాకినాడకు చెందిన సంధ్య అనే అమ్మాయి చెర్రీకి వీరాభిమాని. తన ప్రేమనంతా రంగరించి అక్షరాలుగా గుమ్మరించి ఓ లేఖ రాసింది. చెర్రీని ఏకంగా బావా.. అంటూ పిలవడం విశేషం. 

నా ప్రియాతిప్రియమైన రామ్‌చరణ్‌ బావా...
నా పేరు సంధ్య, మాది కాకినాడ. నీకు నేను వీరాభిమానిని. నీ కళ్లు, నవ్వు, హెయిర్‌, లుక్స్‌, స్టైల్‌, యాటిట్యూడ్‌.. ఇలా ఒక్కటేంటి.. నీలో ప్రతీది ఇష్టమే. నువ్వు చాలా హ్యాండ్‌సమ్‌గా, క్యూట్‌గా.. ఓ రేంజ్‌లో ఉంటావు. ఇక నటన విషయానికొస్తే ఇరగదీస్తావు. ఏ పాత్ర అయినా దాన్ని చింపి పారేస్తావు. నేను నీ సినిమాలు చూసుకుంటూనే పెరిగాను. కేవలం నటన మాత్రమేనా, డ్యాన్సింగ్‌ కూడా ఇచ్చిపడేస్తావు. ఓవరాల్‌గా నన్ను పడగొట్టేశావు. ఏదో ఒకరోజు, ఎప్పుడో ఒకసారి నిన్ను తప్పకుండా కలుస్తానన్న నమ్మకం నాకుంది. ఐ లవ్‌ యూ సో మచ్‌ రామ్‌ చరణ్‌ బావా.. అని రాసుకొచ్చింది.

ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆలస్యం చేయకుండా ఈ లేఖను పోస్ట్‌ బాక్స్‌లో వేసేయండి అని కొందరు మెగా ఫ్యాన్స్‌ ఆమెకు సలహా ఇస్తున్నారు. ఇదిలా వుంటే 'ఆచార్య', 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉండే రామ్‌చరణ్‌ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాడు. తన వ్యానిటీ డ్రైవర్‌ కరోనాతో మృతి చెందడంతో అతడు హోం ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. ఇక గతంలోనే చెర్రీ కోవిడ్‌ బారిన పడి దాన్ని జయించిన విషయం తెలిసిందే.

చదవండి: Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top