‘బేబీ’తర్వాత అలాంటి పాత్రలే వస్తున్నాయి: విరాజ్‌ అశ్విన్‌ | Viraj Ashwin Talks About Joruga Husharuga Movie | Sakshi
Sakshi News home page

‘బేబీ’తర్వాత అలాంటి పాత్రలే వస్తున్నాయి: విరాజ్‌ అశ్విన్‌

Dec 13 2023 4:23 PM | Updated on Dec 13 2023 4:41 PM

Viraj Ashwin Talk About Joruga Husharuga Movie - Sakshi

బేబి చిత్రం హిట్ అవుతుంద‌ని అనుకున్నాం. కానీ ప్రేక్ష‌కులు ఇంత పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇస్తార‌ని అనుకోలేదు. బేబి త‌రువాత చాలా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. కానీ చాలా వరకు లవర్‌బాయ్‌ పాత్రలే వస్తున్నాయి. అయితే నేను మాత్రం కథ, నా పాత్ర నచ్చితేనే సినిమా ఒప్పుకుంటున్నాను’అని యంగ్‌ హీరో విరాజ్‌ అశ్విన్‌ అన్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ హీరోయిన్‌. అనుప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు. నిరీష్ తిరువిధుల ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్‌ 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా విరాజ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

ఒక హిట్ సినిమా త‌రువాత వ‌స్తున్న సినిమాకు ఎంత పెద్ద హెల్ప్ అవుతుంద‌న‌డానికి జోరుగా హుషారుగా మంచి ఉదాహ‌ర‌ణ‌. బేబి త‌రువాత వ‌స్తున్న ఈ  సినిమాపై అంద‌రిలోనూ మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. 

బేబీలో ధ‌నిక యువ‌కుడిగా క‌నిపించాను. ఈ చిత్రంలో ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిగా  క‌నిపిస్తాను. చేనేత కుటుంబానికి చెందిన యువ‌కుడిగా నాలో చాలా ఎమోష‌న్స్ ఉంటాయి. ఎన్నిక‌ష్టాలున్నా మ‌న‌సులో దాచుకుని బ‌య‌టికి సంతోషంగా క‌నిపించే యువ‌కుడిగా నా పాత్ర అంద‌రిని ఎంట‌ర్‌టైన్ చేసే విధంగా ఉంటుంది. ప‌ర్స‌న‌ల్‌గా నాకు నా పాత్ర ఎంతో కనెక్ట్ అయ్యింది. బేబిలో పాత్ర‌కు పూర్తి భిన్న‌మైన పాత్ర‌లో క‌నిపిస్తాను.

ఈ చిత్రంలో ముఖ్యంగా ఫాద‌ర్ అండ్ స‌న్ ఎమోష‌న్ అంద‌ర్ని క‌ట్టిప‌డేస్తుంది. ఒక మిడిల్ క్లాస్ ఫాద‌ర్ త‌న కొడుకును స‌క్సెస్‌ఫుల్ చేయ‌డానికి ఎలాంటి త్యాగాలు చేశాడు?  ఫ్యామిలీ కోసం కొడుకు ఏం చేశాడు? అనేది ఎంతో ఎమోష‌న్‌గా ఉంటుంది. 

ప్ర‌స్తుతానికి హీరోగానే కంటిన్యూ చేస్తాను. న‌చ్చిన పాత్ర‌లు, ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర అయితే ఇత‌ర హీరోల సినిమాల్లో కూడా క‌నిపిస్తాను.

Advertisement
 
Advertisement
Advertisement