'విమానం అంటే నీకెందుకు అంత ఇష్టం నాన్న'.. ఆసక్తిగా ప్రోమో | Vimanam Telugu Movie Promo Released Today | Sakshi
Sakshi News home page

Vimanam: తండ్రీ, కుమారుల అనుబంధమే 'విమానం'.. ఆసక్తిగా ప్రోమో

Apr 14 2023 9:01 PM | Updated on Apr 14 2023 9:02 PM

Vimanam Telugu Movie Promo Released Today  - Sakshi

స‌ముద్ర ఖ‌ని, మీరా జాస్మిన్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న చిత్రం 'విమానం'. జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్స్‌పై సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ ప్రోమోను మేక‌ర్స్  విడుద‌ల చేశారు. 

ప్రోమోను చూస్తే.. అందులో తండ్రీ, కుమారుల కొడుకుల మ‌ధ్య అనుబంధం కథాంశంగా తెరకెక్కిస్తున్నట్లు క‌నిపిస్తోంది. స‌ముద్ర ఖని అంగ వైక‌ల్యంతో బాధ‌ప‌డే మ‌ధ్య వ‌య‌స్కుడిగా, భార్య లేక‌పోయినా పిల్లాడిని  జాగ్ర‌త్త‌గా చూసుకునే వీర‌య్య అనే తండ్రి పాత్ర‌లో న‌టించారు.

జీ స్టూడియోస్‌ సౌత్ మూవీస్ హెడ్ అక్ష‌య్ క్రేజీవాల్ మాట్లాడుతూ..'కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్‌తో అసోసియేట్ కావ‌టం చాలా సంతోషంగా ఉంది. బ‌ల‌మైన క‌థాంశంతో రూపొందిన విమానం ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది. ప్రేక్ష‌కులు మెచ్చే కంటెంట్‌ను అందించ‌ట‌మే మా ల‌క్ష్యం. ఆ దిశ‌గానే అడుగులు వేస్తున్నాం.' అని అన్నారు. ఈ చిత్రంలో మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌, రాజేంద్ర‌న్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.  ఈ సినిమా జూన్ 9 థియేటర్లలో రిలీజ్ కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement