కెప్టెన్ విజయ్‌కాంత్‌.. అవార్డుల రారాజు! | DMDK Founder And Actor Vijayakanth Movie Career And Awards Details Inside - Sakshi
Sakshi News home page

Vijayakanth Cinema Career, Awards: కెప్టెన్ విజయ్‌కాంత్‌.. అవార్డుల రారాజు!

Published Thu, Dec 28 2023 9:57 AM

Vijayakanth Won Movie Awards In His Career  - Sakshi

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్‌ కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్ది సేపటి క్రితమే కరోనా సోకినట్లు ప్రకటించిన వైద్యులు ఆయన మృతి చెందినట్లు తెలిపారు. విజయ్‌కాంత్ మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు. 

1952 ఆగస్టు 25న మదురైలో విజయ్‌కాంత్‌ జన్మించారు. సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్రవేశారు. దాదాపు 150కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. ప్రజలకు సేవల చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు.

ఇనిక్కుం ఇలామైతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విజయ్‌కాంత్‌. సుమారు 100కి పైగా చిత్రాల్లో ఆయన నటించి ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించారు. దాదాపు 20కి పైగా పోలీస్‌గా నటించి మెప్పించారు. కెరీర్‌ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయ్‌కాంత్‌.. ఎస్.ఎ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ‘దూరతు ఇడి ముజక్కం’, ‘సత్తం ఓరు ఇరుత్తరై’లతో విజయాలు అందుకున్నారు. ‘కెప్టెన్‌ ప్రభాకర్‌’ విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్‌గా పిలుస్తున్నారు. విజయ్‌కాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్‌ కావడంతో ఇక్కడి వారికీ ఆయన సుపరిచితులే.  

అవార్డులు

దాదాపు 100కి పైకి సినిమాల్లో నటించిన విజయ్‌కాంత్‌ పలు అవార్డులు సొంతం చేసుకున్నారు. 1981లో ఆయన నటించిన తూరతు ఇడిముజక్కం చిత్రానికి  ప్రపంచ చలన చిత్రోత్సవ అవార్డ్‌ లభించింది. 1986లో అమ్మన్ కోయిల్ కిజకలే చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. 1989లో పూంతోట్ట కవల్కరన్ అనే సినిమాకు ఉత్తమ నటుడిగా ఎక్స్‌ప్రెస్ అవార్డ్ వరించింది. అదే ఏడాదిలో చిందుర పూవే అనే చిత్రానికి ఉత్తమ నటుడు అవార్డుతో పాటు ఫిల్మ్ ఫ్యాన్స్ అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు. 2001లో తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డు అందుకున్నారు. 

వీటితో పాటు 1994లో ‘తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ ఆనరరీ అవార్డు’ (ఎంజీఆర్‌ పురస్కారం). 2001లో ‘బెస్ట్‌ ఇండియన్‌ సిటిజెన్‌ అవార్డు’, 2009లో ‘టాప్‌ 10 లెజెండ్స్‌ ఆఫ్‌ తమిళ్‌ సినిమా అవార్డు’, 2011లో ‘ఆనరరీ డాక్టరేట్‌’ (ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చర్చ్‌ మేనేజ్‌మెంట్‌) పొందారు.  అంతే కాకుండా అనేక ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలు అందుకున్నారు. విజయకాంత్‌ దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం ‘విరుధగిరి’. అందులో ఆయనే హీరో. తన బావ ఎల్‌.కె. సుధీశ్‌తో కలిసి ‘వల్లారసు’, ‘నరసింహ’, ‘సగప్తం’ తదితర చిత్రాలను నిర్మించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement