సవాల్‌కి సై

Vijay Sethupathi to play Muttiah Muralitharan in Biopic - Sakshi

విభిన్న సినిమాలు, విభిన్న పాత్రలతో విశేషంగా ఆకట్టుకుంటున్నారు తమిళ నటుడు విజయ్‌ సేతుపతి. ఆయన భాగమయ్యే ప్రతీ సినిమాకు ప్రత్యేకమైన క్రేజ్‌ ఏర్పడుతుంది. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ప్రముఖ శ్రీలంకన్‌ క్రికెటర్‌ ముత్తయ్య మురళీధర న్‌ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో టైటిల్‌ రోల్‌ను విజయ్‌ సేతుపతి పోషించనున్నారు. ‘800’ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్, థార్‌ మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్లు ఈ సినిమాను నిర్మించనున్నాయి. దర్శకత్వ బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారో ఇంకా ప్రకటించలేదు. ‘ఈ చిత్రంలో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ పాత్ర నాకో చాలెంజ్‌ లాంటిది. ఎప్పుడెప్పుడు షూటింగ్‌ చేస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మురళీధరన్‌గారు కూడా ఈ ప్రాజెక్ట్‌లో మాకు తోడుగా ఉండటం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు విజయ్‌ సేతుపతి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top