పెద్ద మనసు చాటుకున్న విజయ్‌ సేతుపతి

Vijay Sethupathi Donates Huge Amount To Tamil Nadu CM Relief Fund - Sakshi

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ సృష్టించిన బీభత్సం అంత ఇంత కాదు. వేలాది మంచి మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది ఉపాదిని కోల్పోయి రోడ్డున​ పడ్డారు. ముఖ్యంగా ఈ సెకండ్‌ వేవ్‌ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది.

ఈ క్రమంలో పేదలకు అండగా ఉండేందుకు సినీ తారలు ముందుకు వస్తున్నారు. కోవిడ్‌పై పోరాటం చేస్త్నున్న ప్రభుత్వాలకు తమ వంతు సాయం చేసి పెద్దమనసును చాటుకుంటున్నారు. ఇప్పటికీ పలువురు సినీ ప్రముఖులు తమకు తోచిన విధంగా సహాయం అందించారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కోవిడ్‌ బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. కోవిడ్‌పై పోరాటానికి తమిళనాడు ప్రభుత్వానికి రూ. 25 లక్షలు అంజేశాడు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి పాతిక లక్షల రూపాయల చెక్కును అందజేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ని కలుసుకొని ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును సమర్పించాడు.

ప్రస్తుతం విజయ్‌ సేతుపతి తమిళంలోనే కాదు తెలుగులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీలో విజయ సేతుపతి నటించాడనున్నాడట. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకోవాలని సన్నాహాలు చేస్తున్నారట.
చదవండి:
రజనీ ఆరోగ్యంపై మళ్లీ ఆందోళన.. ప్రత్యేక విమానంలో...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top