విజయ్‌ సేతుపతితో జాతీయ నటి ఫిక్స్‌... షూటింగ్‌ ప్రారంభం | Vijay Sethupathi And Nithya Menon Movie | Sakshi
Sakshi News home page

విజయ్‌ సేతుపతితో జాతీయ నటి ఫిక్స్‌... షూటింగ్‌ ప్రారంభం

Oct 23 2024 7:00 AM | Updated on Oct 23 2024 11:10 AM

Vijay Sethupathi And Nithya Menon Movie

కథానాయకుడు, ప్రతినాయకుడు అనే వ్యత్యాసం చూపకుండా పాత్ర నచ్చితే నటించడానికి సిద్ధమవుతున్న అరుదైన నటుడు విజయ్‌ సేతుపతి. తాజాగా బిగ్‌బాస్‌ రియాల్టీ గేమ్‌నూ యాంకరింగ్‌ చేస్తున్న ఈయన ఇప్పుడు నూతన చిత్రంలో నటించడానికి సిద్ధం అయ్యారు. ఈయన జంటగా జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత నటి నిత్యామీనన్‌ నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రానికి పాండిరాజ్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. 

ఈయన ఇంతకుముందు పసంగ, మెరీనా. కేడి బిల్లా కిలాడి రంగ, పసంగ –2, ఇది నమ్మ ఆలు, కథాకళి, కడైకుట్టి సింగం వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. కాగా ఈయన తన తాజా చిత్రాన్ని విజయ్‌ సేతుపతి, నిత్యామీనన్‌ జంటగా తెరకెక్కిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్‌ మంగళవారం తిరుచెందూరులో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 

అక్కడ సముద్రతీరంలో విజయ్‌ సేతుపతి తదితర నటీనటులతో సన్నివేశాలను తదుపరి తూత్తుకుడి రామేశ్వరం ప్రాంతాల్లో షూటింగులు నిర్వహించనున్నట్లు యూనిట్‌ వర్గాలు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు వారు పేర్కొన్నారు.


Advertisement
 
Advertisement
Advertisement