Actor Vijay And Pooja Hegde Beast Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Beast Movie Release Date: విజయ్ 'బీస్ట్‌' చిత్రం రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. వచ్చేది అప్పుడే

Mar 22 2022 5:20 PM | Updated on Mar 22 2022 7:11 PM

Vijay Pooja Hegde Starrer Beast Movie Release Date Out - Sakshi

Vijay Pooja Hegde Starrer Beast Movie Release Date Out: కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్‌, టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే జోడిగా నటించిన చిత్రం 'బీస్ట్‌'. ఈ సినిమా గురించి తాజా అప్‌డేట్‌ ఇచ్చింది చిత్రబృందం. విజయ్‌ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ బీస్ట్‌ మూవీ విడుదల తేది ఫిక్స్‌ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఏప్రిల్‌ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు ఓ పోస్టర్‌ ద్వారా పంచుకుంది. ఈ పోస్టర్‌లో విజయ్‌ గన్‌ పట్టుకుని సీరియస్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన అరబిక్‌ కుతు, జాలీ ఓ జింఖానా పాటలు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. 

అరబిక్ కుతు సాంగ్ అయితే యూట్యూబ్‌లో ఏకంగా 210 మిలియన్లకుపైగా వ్యూస్‌ సొంతం చేసుకోగా జాలీ ఓ జింఖానా సాంగ్‌ 20 మిలియన్‌ వ్యూస్‌ సాధించింది. కోలీవుడ్ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచంద్రన్ 'బీస్ట్‌'కు సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో కళానిధి మారన్‌ నిర్మాతగా బాధ్యతలు చెపట్టగా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. ఇదివరకు విడుదలైన పాటలతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే సినీ లవర్స్‌ ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా చిత్రం 'కేజీయఫ్‌ 2' మూవీ ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. మరీ ఈ రెండు చిత్రాల మధ్య పోటీ ఎలా ఉంటుందో వేచి చూడాలి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement