థియేటర్లలో ది గోట్.. ఆడియన్స్‌ రెస్పాన్స్ ఎలా ఉందంటే? | Vijay Latest Movie The Goat Twitter Review From Audience | Sakshi
Sakshi News home page

The Goat Twitter Review: విజయ్ ది గోట్‌.. ట్విటర్ రివ్యూ

Sep 5 2024 7:00 AM | Updated on Sep 5 2024 9:27 AM

Vijay Latest Movie The Goat Twitter Review From Audience

కోలీవుడ్ స్టార్‌, దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం 'ది గోట్'(గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్‌ టైమ్‌). ఈ సినిమాకు వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ రోజు నుంచే ది గోట్‌ థియేటర్లలోకి వచ్చేసింది. ఓవర్‌సీస్‌తో పాటు ఇండియాలోనూ మార్నింగ్ షోలు పడిపోయాయి. తెల్లవారుజూము నుంచే థియేటర్ల వద్ద విజయ్ ఫ్యాన్స్‌ సందడి చేస్తున్నారు.

ఫస్ట్ హాఫ్‌ ముగియగానే ఆడియన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ యాక్టింగ్‌ అదిరిపోయిందని అంటున్నారు. ఫైట్స్‌, యాక్షన్‌ సీన్స్‌లో విజయ్‌ ఫర్మామెన్స్  వేరే లెవెల్ అని ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉందని.. విజయ్ ఖాతాలో మరో బ్లాక్‌ బస్టర్ ఖాయమని చెబుతున్నారు. అయితే ఇదే కేవలం ఆడియ‍న్స్‌ అభిప్రాయం మాత్రమే..ఈ సమీక్షకు సాక్షి ఎలాంటి బాధ్యత వహించదని తెలియజేస్తున్నాం. 

Advertisement
 
Advertisement
Advertisement