Vijay Deverakonda: కీలక ప్రకటన చేసిన విజయ్‌ దేవరకొండ

Vijay Deverakonda Announce That Donating His Organs in a Event - Sakshi

రౌడీ హీరో విజయ్‌ గొప్ప మనసు చాటుకున్నాడు. తన మరణాంతరం అవయవ దానం చేస్తానని వెల్లటించాడు. కాగా బాలల దినోత్సవం సందర్బంగా మాదాపూర్‌లోని పేస్‌ హాస్పిటల్‌ అధ్వర్యంలో చిన్నారుల్లో కాలేయ మార్పిడి అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. దీనికి విజయ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. కాలేయ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేస్తున్న 24 గంటల హెల్ప్‌లైన్‌ను విజయ్‌ ప్రారంభించాడు.

చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు

అనంతరం చిన్నారులతో కాసేపు ముచ్చటించి వారికి బహుమతులు అందించాడు. ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ.. ‘డాక్టర్లు నాకు ఇప్పుడే చెప్పారు.. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన చాలా ఆపరేషన్స్ పబ్లిక్ డోనర్స్, ప్రభుత్వ డోనర్ షిప్ వల్ల జరిగినవే అని. ఇతరుల కోసం అవయవాలను దానం చేయడం చాలా గొప్ప విషయం. అయితే దక్షిణాది దేశాల్లో ఆర్గాన్ డోనేషన్ అనే కల్చర్ చాలా తక్కువని డాక్టర్లు చెబుతున్నారు.

చదవండి: హీరోతో డేటింగ్‌, పెళ్లి.. ఇన్‌స్టా పోస్ట్స్‌ డిలీట్‌ చేసిన మంజిమా మోహన్‌

మీ అందరి ముందు చెప్తున్నా నేను నా అవయవాలన్నింటిని దానం చేస్తునన్నా’ అని ప్రకటించాడు. విజయ్‌ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆస్పత్రి వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్‌ మాట్లాడిన వీడియోను సదరు ఆస్పత్రి యాజమాన్యం తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. విజయ్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై అతడి ఫ్యాన్స్‌, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. షరియల్‌ హీరో’, ‘మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో గొప్పది అన్న’ అంటూ విజయ్‌ని కొనియాడుతున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top