Manjima Mohan: హీరోతో డేటింగ్‌, పెళ్లి.. ఇన్‌స్టా పోస్ట్స్‌ డిలీట్‌ చేసిన మంజిమా మోహన్‌

Here Is Why Actress Manjima Mohan Deleted Her Instagram Posts - Sakshi

కోలీవుడ్‌లో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళీ బ్యూటీ మంజిమా మోహన్‌. నటుడు శింబుకు జంటగా అచ్చం యంబదు మడమయడా చిత్రంలో కథానాయికగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ కార్తీక్‌ వంటి యువ హీరోలతో జత కట్టింది. అలా గౌతమ్‌ కార్తీక్‌తో పరిచయం ప్రేమగా మారింది. ఈ జంట చాలా కాలంగానే ప్రేమించుకుంటున్నా ఆ విషయాన్ని బయట పెట్టలేదు. ఇటీవల వీరి ప్రేమ వ్యవహారం మీడియాకు పొక్కడంతో అవును తాము ప్రేమలో ఉన్నామని అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ సంచలన జంటకు పెళ్లి ఘడియలు దగ్గర పడ్డాయి. ఈ నెల 28వ తేదీ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు.

చదవండి: హీరోతో పెళ్లి పీటలు ఎక్కబోతున్న మంజిమా మోహన్‌!

అందుకోసం చెన్నైలోని ఒక ప్రైవేటు గెస్ట్‌ హౌస్‌ ముస్తాబవుతోందని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో నటి మంజిమా మోహన్‌ తన ఇన్‌స్ట్ర్రాగామ్‌ లోని ఫొటోలన్నీ డిలీట్‌ చేశారు. అందుకు కారణాన్ని కూడా వెల్లడించారు. గత జ్ఞాపకాలను తొలగించేస్తూ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నానని, కాబట్టి తన పాత జ్ఞాపకాలను చూసుకుని బాధపడకూడదనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు తీసివేసినట్లు చెప్పారు. అంతేకాకుండా కొత్త జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలను పదిల పరచుకోవడానికి చోటు అవసరం కావడంతో తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాళీ చేసినట్లు మంజిమా మోహన్‌ పేర్కొన్నారు. కాగా గౌతమ్‌ కార్తీక్‌తో ఉన్న ఫొటోలను మాత్రమే తన ఇన్‌స్టాలో ఉంచారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top