విజయ్‌ దేవరకొండ బర్త్‌డే స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేస్తుంది..

Vijay Devarakondas New Film Liger Teaser May Relase On His Birthday - Sakshi

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్‌ భామ అనన్య పాండే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్‌’. ఈ చిత్రాన్ని మాస్‌ దర్శకుడు పూరీ జగన్నాద్‌, బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌లు సంయుక్తంగా పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం క్రితమే ఈ మూవీని అనౌన్స్‌ చేసినా కరోనా కారణంగా లైగర్‌ ఆలస్యం అవుతూ వస్తోంది.

ప్రస్తుతం షరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాపై వస్తోన్న అప్‌డేట్స్‌ ప్రేక్షకుల్లో హైప్‌ను క్రియేట్‌ చేస్తున్నాయి. తాజాగా విజయ్‌ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ రానుంది. ఈనెల 9న విజయ్‌ బర్త్‌డే సందర్భంగా లైగర్‌ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లుఘో వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈ సినిమాలో విజయ్‌ బాక్సర్‌గా చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం విజయ్‌ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని మూవీ టీం భావిస్తుంది. ఒకేసారి తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. 

చదవండి : రష్మికను డిన్నర్ డేట్‌కి తీసుకెళ్లిన విజయ్‌.. ఫోటోలు వైరల్‌
ఆ విషయాన్ని మీరు విజయ్‌నే అడగండి : రష్మిక

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top