ఎంత బిజీగా ఉన్నా టైం తీసుకొని మరీ హోటల్‌కి..

Vijay Deverakonda Dinner Date With Rashmika Mandanna Photos Viral - Sakshi

‘గీతగోవిందం’, 'డియర్‌ కామ్రేడ్‌' సినిమాలతో హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జంట విజయ్‌దేవరకొండ- రష్మిక మందన్నా. ప్రస్తుతం పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా సినిమాలో విజయ్‌ నటిస్తుండగా, సుకుమార్‌ డైరెక‌్షన్‌లో వస్తోన్న పుష్ప సినిమాలో రష్మిక నటిస్తుంది. అయితే గత కొన్నాళ్లుగా విజయ్‌- రష్మిక ప్రేమలో ఉన్నారని పలు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలసిందే. తాజాగా వీరిద్దరూ కలిసి ముంబైలోని ఓ స్టార్‌ హోటల్‌లో డిన్నర్‌ డేట్‌కి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి.


వీరిద్దరి మధ్యా ఏదో ఉందని, అందుకే షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా కలుసుకోవడానికి ఒకరికొకరు టైం కేటాయిస్తున్నారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా సిద్ధార్ధ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టిస్తున్న `మిష‌న్ మ‌జ్ను` సినిమాతో ర‌ష్మిక  బాలీవుడ్ కు ప‌రిచ‌యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం ముంబైలో జ‌రుగుతోంది. మరోవైపు లైగర్‌ సినిమా షూటింగ్‌ కోసం విజయ్‌ ముంబైకి వెళ్లాడు. దీంతో ఇద్దరూ కలిసి డిన్నర్‌ డేట్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది.


ఈ ఫోటోల్లో రష్మిక ఎంతో అందమైన వైట్‌ ఫ్లవర్స్‌ని చేతిలో పట్టుకొని కెమెరాలకు ఫోజులిచ్చింది. దీంతో ఈ పువ్వులు నిజంగానే రౌడీ విజయ్‌ ఇచ్చాడా అంటూ అప్పుడే  కొందరు గాసిప్స్‌ అల్లేస్తున్నారు. ఏదైతేనేం ఈ ఆన్‌స్క్రీన్‌ జోడీ చాలా రోజుల తర్వాత ఇద్దరూ కలిసి దర్శనమివ్వడంతో ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. క్యూట్‌ పెయిర్‌ అంటూ కదా అంటూ వీరిద్దరి లేటెస్ట్‌ ఫోటోలను షేర్‌ చేస్తున్నారు. 

చదవండి : ఎన్టీఆర్‌ సినిమా: హీరోయిన్‌ రేసులో రష్మిక‌‌
అది విజయ్‌ క్రేజ్‌.. మరో బాలీవుడ్‌ భామతో రొమాన్స్‌‌

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top