Vijay Devarakonda Reaches 15 Million Followers on Instagram - Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ సరికొత్త రికార్డు.. ఫాస్టెస్ట్ సౌత్‌ హీరోగా రౌడీ హీరో

Apr 15 2022 8:12 PM | Updated on Apr 15 2022 8:22 PM

Vijay Devarakonda Has 15 Million Followers On Instagram - Sakshi

అత్యంత కొద్ది సమయంలోనే మోస్ట్‌ పాపులారిటీ సంపాదించుకున్నాడు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి డిమాండ్‌ ఉన్న స్టార్లలో విజయ్‌ ఒకరని చెప్పడంలో సందేహం లేదు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, డియర్ కామ్రెడ్‌ చిత్రాల భారీ విజయంతో విజయ్‌కు మంచి పేరు వచ్చింది. అయితే రెండేళ్లనుంచి ఈ రౌడీ హీరో సినిమా రాలేదు.

అత్యంత కొద్ది సమయంలోనే మోస్ట్‌ పాపులారిటీ సంపాదించుకున్నాడు రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం టాలీవుడ్‌లో మంచి డిమాండ్‌ ఉన్న స్టార్లలో విజయ్‌ ఒకరని చెప్పడంలో సందేహం లేదు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, డియర్ కామ్రెడ్‌ చిత్రాల భారీ విజయంతో విజయ్‌కు మంచి పేరు వచ్చింది. అయితే రెండేళ్లనుంచి ఈ రౌడీ హీరో సినిమా రాలేదు. అయితే తన ఫ్యాన్స్‌ను రెండేళ్లు వెయిట్‌ చేయించిన విజయ్‌ డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ డైరెక్షెన్‌లో తెరకెక్కుతున్న 'లైగర్‌' మూవీతో ఐఫీస్ట్‌ ఇవ్వనున్నాడు. లైగర్‌ మూవీ రికార్డులను కచ్చితంగా బద్దలు కొడుంతుందని ఇటు విజయ్‌ ఫ్యాన్స్‌, అటు పూరీ అభిమానులు ఎంతో నమ్మకంగా ఉన్నారు. 

అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే విజయ్‌ దేవరకొండ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ను సాధించిన ఫాస్టెస్ట్‌ సౌత్‌ ఇండియా హీరోగా నిలిచాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో వేగంగా 15 మిలియన్ల ఫాలోవర్లను సాధించిన సౌత్‌ హీరోగా రికార్డుకెక్కాడు రౌడీ హీరో. టాలీవుడ్‌లో విజయ్‌ కంటే ముందుగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ 18 మిలియనల్ ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత 8.3 మిలియన్లతోపాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, 8.1 మిలియన్లతో మహేశ్‌ బాబు ఉన్నారు. వీరిద్దరి కంటే విజయ్‌ ముందుండటం విశేషం. దీంతో ఈ రౌడీ హీరో అభిమానులు పట్టరాని సంతోషంతో ఉన్నారు. 

చదవండి: పూరీ జగన్నాథ్‌ 'జనగణమన' పోస్టర్‌ లాంచ్‌.. అప్పుడే వార్‌ స్టార్ట్‌




చదవండి: 'పుష్ప' మూడో భాగంలో హీరోగా విజయ్‌ దేవరకొండ !

Advertisement
 
Advertisement
Advertisement