పెళ్లి కబురుతో ఫోటో షేర్‌ చేసిన విజయ్‌ దేవరకొండ | Vijay Devarakonda Getting Married Soon | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda:పెళ్లి కబురుతో ఫోటో షేర్‌ చేసిన విజయ్‌ దేవరకొండ

Published Tue, Aug 29 2023 8:56 PM | Last Updated on Tue, Aug 29 2023 9:36 PM

Vijay Devarakonda Getting Married Soon - Sakshi

టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో విజయ్ దేవరకొండ (34) కూడా ముందు వరుసలో ఉంటారు. ఈ మధ్య శర్వానంద్‌, వరుణ్‌తేజ్‌ పెళ్లి తంతు తెరపైకి వచ్చిన వెంటనే విజయ్‌ పెళ్లి ఎప్పుడు అని ఆయన్నే డైరెక్ట్‌గా చాలామంది అడిగారు. అందుకు సమాధానంగా ఆయన కూడా త్వరలో ఆ శుభకార్యం జరగబోతుందని కూడా చెప్పాడు. ఖుషి సినిమా విడుదల తర్వాత  విజయ్‌ దేవరకొండ పెళ్లిపీటలు ఎక్కడం ఖాయం అని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: విజయనిర్మల వేల కోట్ల ఆస్తి ఎవరి సొంతం.. వీలునామాలో ఎవరి పేరు రాశారంటే: నరేష్‌ కుమారుడు)

తాజాగ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో విజయ్ దేవరకొండ ఓ పోస్ట్ చేశారు. అందులో రెండు చేతులు ఉన్నాయి. ఈ ఫొటోలో విజయ్ దేవరకొండ చేయి మరొకరి చేతిలో ఉంది. మరోకరు ఎవరనేది ఆయన రివీల్‌ చేయలేదు. కానీ ఆ ఫోటోకు విజయ్‌ ఇచ్చిన క్యాప్షన్‌ మాత్రం ఇలా ఉంది. 'జీవితంలో చాలా జరుగుతున్నాయి. కానీ ఇది మాత్రం చాలా స్పెషల్. అన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తా.' అని విజయ్‌ పేర్కొన్నారు. ఈ విదమైన విషయాలను తన సోషల్‌మీడియా ద్వారా ఆయన ఎప్పుడూ షేర్‌ చేయలేదు. దీంతో ఇది ఖచ్చితంగా ప్రేమ, పెళ్లికి సంబంధించిన కబురు చెప్పబోతున్నారని నెటిజన్లు ఊహిస్తున్నారు.

ఆ చెయి రష్మికదేనా..
విజయ్ దేవరకొండ, రష్మిక  ప్రేమలో ఉన్నారని ఇండస్ట్రీలో చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. దీంతో విజయ్ దేవరకొండ షేర్‌ చేసిన ఫోటోలో ఉన్న మరో చెయి రష్మికదే అని పలువరు పేర్కుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య విజయ్‌ తల్లిదం‍డ్రులను రష్మిక కలిసిన విషయం తెలిసిందే. దీంతో వారి సందేహాలు కూడా మరింత బలంగా ఉన్నాయి. 

ముందే క్లూ ఇచ్చిన విజయ్‌
త్వరలో పెళ్లి చేసుకుంటానని ఖుషి సినిమా ప్రమోషన్ల సమయంలో విజయ్ దేవరకొండ చెప్పిన విషయం తెలిసిందే.  విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనందల​ నటించిన 'బేబీ' సినిమాలోని ఓ సాంగ్ విడుదల కార్యక్రమానికి రష్మిక వచ్చారు. అప్పుడు విజయ్‌ ఫ్యాన్స్‌ అందరూ వదిన.. వదిన అంటూ గట్టిగా అరిచినా ఆమె తనలో తాను నవ్వుకుంటూ ఉండింది. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా గీత గోవిందం,డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించారు. ఆ సమయం నుంచి వారిద్దరి మధ్య మంచి బాండింగ్‌ ఉంది. అలా వారిద్దరు ప్రేమలో పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement