
గిరిజనులను కించపరిచేలా మాట్లాడారంటూ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)పై ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిషన్ రాజ్ చౌహాన్..పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రెట్రో ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో విజయ్ మాట్లాడుతూ..గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చారని, అతనిపై చర్యలు తీసుకోవాలని కిషన్ రాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా ఈ వివాదంపై హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. తాను ఏ కమ్యూనిటీనీ కించపరిచేలా మాట్లాడలేదని, దేశం మొత్తం ఒక్కటే అని, మనమంతా ఒకే కుటుంబం అని తెలియజేయడానికే ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పారు. తన మాటలు ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే.. చింతిస్తున్నానని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఇంతకీ ఏం జరిగింది?
తమిళ హీరో సూర్య హీరోగా నటించిన రెట్రో ప్రీరిలీజ్ ఈవెంట్‌కి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వెళ్లాడు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడుతూ.. ఇండియా పాకిస్తాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు.. క్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు.. బుద్ధి లేకుండా, కనీస కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి’ అని విజయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు గిరిజనులను ఉగ్రవాదులతో పోల్చాయని, వారిని అవమానించాయని కిషన్ రాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయ్‌పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నా ఉద్దేశం అది కాదు: విజయ్
అయితే విజయ్ మాత్రం ట్రైబ్స్ అనే పదం వాడిన మాట నిజమే కానీ.. దాని అర్థం గిరిజనులు కాదని అంటున్నాడు. ‘వందల ఏళ్ల కిందట సమాజం, ప్రజలు గుంపులుగా వ్యవస్థీకృతమై ఉండేవాళ్లని నా ఉద్దేశం. అలాంటి సమయంలో రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకునేవి. ఆ సెన్స్‌లోనే ట్రైబ్స్ అనే పదం వాడాను. అంతేకానీ, ఇప్పుడున్న షెడ్యూల్ ట్రైబ్‌ని ఉద్దేశించి నేను వ్యాఖ్యలు చేయలేదు. అయినా కూడా నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని హర్ట్ అయితే విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని విజయ్ తన ఎక్స్ ఖాతాలోరాసుకొచ్చాడు. శాంతి, అభివృద్ధి, ఐక్యత గురించి మాత్రమే తాను మాట్లాడనని, మనమంతా ఒక్కటే అని చెప్పడమే తన ఉద్దేశం అన్నారు. ఈ మాటకు ఎవరైనా
To my dear brothers ❤️ pic.twitter.com/QBGQGOjJBL
— Vijay Deverakonda (@TheDeverakonda) May 3, 2025