Director K Vijay Bhaskar Son Sree Kamal Debut With Jilebi Movie, First Glimpse Out - Sakshi
Sakshi News home page

Vijay Bhaskar: హీరోగా పరిచయమవుతున్న ప్రముఖ దర్శకుడి కుమారుడు

Apr 7 2023 10:05 AM | Updated on Apr 7 2023 10:54 AM

Vijay Bhaskar Son Sree Kamal Debut With Jilebi, First Glimpse Out - Sakshi

‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’లను ఆయన ఎంత చక్కగా తీశారో మనందరికీ తెలుసు. ఆయన తీసిన ‘జిలేబి’ కూడా తప్పకుండా మంచి వినోదాత్మక చిత్రం అవుతుందని

‘‘విజయ భాస్కర్‌గారు నాకు ఇష్టమైన డైరెక్టర్‌. నా ఫేవరేట్‌ చిత్రాలైన ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’లను ఆయన ఎంత చక్కగా తీశారో మనందరికీ తెలుసు. ఆయన తీసిన ‘జిలేబి’ కూడా తప్పకుండా మంచి వినోదాత్మక చిత్రం అవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు హీరో వెంకటేశ్‌. దర్శకుడు విజయ భాస్కర్‌ తనయుడు శ్రీ కమల్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘జిలేబి’. ఈ చిత్రంలో శివానీ రాజశేఖర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. విజయ భాస్కర్‌ దర్శకత్వంలో అంజు అశ్రాని సమర్పణలో ఎస్‌ఆర్‌కే పతాకంపై గుంటూరు రామకృష్ణ నిర్మించారు.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్‌ను విడుదల చేసిన అనంతరం వెంకటేశ్‌ మాట్లాడుతూ.. ‘‘జిలేబి’తో నటుడిగా పరిచయమవుతున్న కమల్‌కి, నిర్మాతలు రామకృష్ణ, అంజులకు ఆల్‌ ది బెస్ట్‌. ఇది అందరూ చూసే సినిమా అవుతుంది’’ అన్నారు. ‘‘వెంకటేష్‌గారి చేతులమీదుగా మా అబ్బాయి నటించిన ‘జిలేబి’ గ్లింప్స్‌ లాంచ్‌ కావడం సంతోషంగా ఉంది. ‘జిలేబి’ అందమైన ప్రయాణం. మణిశర్మగారు, రామకృష్ణ, అంజు, కెమెరామేన్‌ సతీష్‌... ఇలా అందరం కలిసి ఓ కుటుంబంలా పనిచేశాం’’ అన్నారు విజయ్‌ భాస్కర్‌. ‘‘నా మనసుకు దగ్గరైన సినిమా ‘జిలేబి’’ అన్నారు శివాని. ‘‘నిర్మాతగా నా తొలి చిత్రం ఇది. బ్యాలెన్స్‌ ఉన్న రెండు పాటలను ఫారిన్‌లో చిత్రీకరించనున్నాం’’ అన్నారు రామకృష్ణ. ‘‘విజయభాస్కర్‌లాంటి దర్శకునితో మా తొలి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు అంజు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement