Vignesh Shivan Shares Cryptic Post On Mental Health Amid Surrogacy Issue, Deets Inside - Sakshi
Sakshi News home page

Vignesh Shivan: మన జీవితంలో సంతోషానికి అదే కారణం: విఘ్నేశ్ శివన్

Oct 19 2022 6:23 PM | Updated on Oct 19 2022 7:14 PM

Vignesh Shivan Shares Cryptic Posts About Surrogacy Issue On Nayanatara Twins - Sakshi

ఇటీవల నయనతార దంపతులు సరోగసి వివాదం తెలిసిందే. ప్రస్తుతానికి ఆ జంట ప్రభుత్వానికి వివరణ ఇవ్వడంతో సమసిపోయింది. అయితే తాజాగా విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టా స్టోరీస్ షేర్ చేశాడు. ‍అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రేస్టేషన్‌లో ఉన్న రోజుల గురించి స్టోరీలో ప్రస్తావించారు. మనం చూసే విధానం బాగుంటే ప్రతి దానిలో మంచి కనిపిస్తుందన‍్న సందేశంతో కోట్స్ షేర్ చేశారు. గతంలో ఓ నిర్మాత షేర్ చేసిన ఇన్‌స్టా కోట్స్‌ను సోషల్ మీడియాలో విఘ్నేశ్ పోస్ట్ చేశారు. 

విఘ్నేష్ ఇన్‌స్టా స్టోరీలో 'మనకు మంచి రోజులు ఉన్నాయి. కానీ ఫ్రస్టేషన్‌ ఉన్న రోజులు కూడా కొన్నిసార్లు మనకు మంచిదే. ప్రతిదానిలో మంచిని చూసేందుకు ప్రయత్నిచండి. అందుకు ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా తీసుకోండి. మీ జీవితంలో ఆనందం అనేది మన ఆలోచనలపైనే అధారపడి ఉంటుంది.' అని కోట్స్‌లో రాసి ఉంది. ఆ రెండు పోస్టులు ఇటీవల నయనతార కవలలకు జన్మనివ్వడంతో వచ్చిన వివాదాన్ని ఉద్దేశించే చేసినట్లు అభిమానులు భావిస్తున్నారు.  


 

Advertisement
 
Advertisement
Advertisement