నయనతారలో నచ్చేది అదే : విఘ్నేష్‌ శివన్‌

Vignesh Shivan Reveals Quality Of Nayanthara Which Admires Him Most - Sakshi

కోలీవుడ్‌ లవ్‌ కపుల్‌ అనగానే ఠక్కున గుర్తొచ్చేది నయనతార- విఘ్నేష్‌ శివన్‌ల జంటే. దాదాపు నాలుగేళ్లుగా వీరు ప్రేమలో మునిగి తెలుతున్నారు. ఈ జంట పెళ్లి చేసుకోరు. కనీసం ప్రేమించుకుంటున్నాం అని కూడా చెప్పరు. అయినా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి బర్త్‌డే లాంటి వేడుకలు, పార్టీల్లో పాల్గొంటూ ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటారు. ఈ ఏడాది ఆఖరులో పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం సాగింది. అయితే విఘ్నేష్‌ ఆ వార్తలను ఖండించారు. ఈ జంట గురించి ఎప్పుడూ ఏదో ఓ వార్త హైలేట్‌ అవుతూనే ఉంటుంది.

తాజాగా విఘ్నేష్ శివ‌న్ త‌న ఫాలోవ‌ర్స్‌తో  ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇక నయనతారలో నచ్చే క్వాలిటీస్‌ ఏంటి అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. నయన్‌ సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్ అంటే తనకు చాలా ఇష్టమని విఘ్నేష్ శివ‌న్ చెప్పుకొచ్చాడు. ఇక నయనతారతో కలిసి దిగిన ఓ ఫోటను షేర్‌ చేస్తూ..ఇది తన ఫేవరేట్‌ పిక్‌ అని తెలిపాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే అన్నాతే, కాతు వాకులా రెండు కాదల్‌, మూడో కన్ను, సహా మరో నాలుగు సినిమాలకు నయన్‌ సైన్‌ చేసింది. 

చదవండి : పెళ్లిపై నయనతార యూటర్న్‌; షాకైన విఘ్నేష్‌ పేరెంట్స్‌!
బోర్‌ కొట్టినప్పుడే పెళ్లి 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top