పామును పట్టుకున్న విద్యుత్‌ జమ్వాల్‌

Vidyut Jammwal Made Followers Shock With His Video - Sakshi

ఒక్కోసారి సెలబ్రిటీలు పెట్టే పోస్టులు నెటిజన్లకు గిలిగింతలు పెట్టిస్తాయి. సోషల్‌ మీడియాలో వారు పెట్టే పోస్టులతో ఫాలోవర్స్‌ను ఆట పట్టిస్తుంటారు కొందరు. బాలీవుడ్‌ హీరో విద్యుత్‌ జమ్వాల్ ఇటీవల తన సినిమా సెట్‌లోకి పాము వచ్చిందంటూ, తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి అంటూ ఓ వీడియోని పోస్ట్‌ చేశారు. కానీ ఆ వీడియో చివర్లో ఎవ్వరూ ఊహించని ఓ ట్విస్ట్‌ ఉంది.

విద్యుత్‌ జమ్వాల్‌కు సినిమాల్లోనే కాదు రియల్‌ లైఫ్‌లో కూడా రిస్క్‌లు చేయడం బాగా సరదా అని అందరికి తెలిసిన విషయమే. చాలా వరకు ఆయన సినిమాలకు స్వయంగా స్టంట్లు డిజైన్‌ చేస్తారు. తాజాగా ఆ నటుడుకి  అనుకోని పరిస్థితి ఎదురైతే.. అప్పుడు ఏం చేస్తారు.. రీల్‌ హీరోలాగా ఫైట్‌ చేస్తారా లేదా వెనుదిరిగి వెళ్లిపోతారా. దీనికి సమాధానమే ఇది అన్నట్టు ఓ వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆయన సినిమా సెట్‌లోకి ఓ పాము వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. అంటూ ఆసక్తికరంగా మొదలైన వీడియోలో ముగింపుని ఎవ్వరూ ఊహించలేరు. అసలు ఆ వీడియోలో ఏం జరిగిందో, ఆ ట్విస్ట్‌ ఏంటో చూసేయండి మరి.
 

This is how it's done😶 #CountryBoy

A post shared by Vidyut Jammwal (@mevidyutjammwal) on

విద్యుత్‌ యాక్షన్‌కు ఫ్యాన్స్‌ రియాక్షన్‌
ఈ ఫన్నీ వీడియోతో ఫ్యాన్‌ను నవ్వుల్లో ముంచేశాడు విద్యుత్‌. వారు ఆ వీడియోను ఎంత ఎంజాయ్‌ చేశారో కామెంట్స్‌ చూస్తే తెలిసిపోతోంది. అందరిని పిచ్చివాళ్లని చేశావ్‌గా అని ఒక అభిమాని అంటే, పాముని బెల్ట్‌ చేశావేమో అనుకున్నా.. ఎందుకంటే నువ్వు ఏమైనా చేయగలవ్‌ అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

హాట్‌ స్టార్‌లో విడుదలైన ఖుదా హఫీజ్‌ చిత్రంలో చివరిగా కనిపించాడు విద్యుత్‌. ఆ సినిమా పర్వాలేదు అనిపించేలా ఉన్నా.. ఎప్పటి లాగే విద్యుత్‌ స్టంట్‌లకు మంచి మార్కులు పడ్డాయి. ఎమోషన్స్‌ బాగా పండించినందుకు దర్శకుడు ఫరూక్‌ కబీర్‌ కూడా అభినందనలు అందుకున్నాడు. అంతకు ముందు రిలీజైన యారా సినిమా కూడా ప్రేక్షకులను బాగానే అలరించింది. తిగ్‌మాన్షు దులియా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శృతి హాసన్‌, అమిత్‌ సధ్‌, విజయ్‌ వర్మ, కెన్ని బసుమత్రి, అంకుర్‌ వికార్‌ కీలక పాత్రలు పోషించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top