Raimohan Parida Suicide Death: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం

Veteran Odia Actor Raimohan Parida Died By Suicide In Bhubaneswar - Sakshi

Veteran Odia Actor Raimohan Parida Died By Suicide In Bhubaneswar: ఒడియా చిత్ర పరిశ్రమలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఇటీవల బుల్లితెర నటి రష్మీరేఖ ఓజా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ నటుడు రాయ్‌మోహన్ పరిదా బలవన్మరణానికి పాల్పడ్డారు. 58 ఏళ్ల ఈ వెటరన్‌ యాక్టర్‌ శుక్రవారం (జూన్‌ 24) భువనేశ్వర్‌లోని ప్రాచి విహార్‌ ప్రాంతంలో ఉన్న ఆయన ఇంట్లో ఉరివేసుకున్నారు. రంగప్రవేశం చేసిన పోలీసులుగా ఆత్మహత్యగా భావించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

రాయ్‌మోహన్‌ పరిదా ఆత్మహత్యతో ఒడియా సినీ లోకం దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు సెలబ్రిటీలు ఆయన ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. 'జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్న వ్యక్తి ఇలా ఆత్మహత్య చేసుకున్నారంటే నమ్మలేకపోతున్నా. అతను తన నటుడిగా ఎంతో విజయవంతమయ్యారు' అని రాయ్‌మోహన్‌తో కలిసి నటించిన సిద్ధాంత మహాపాత్ర తెలిపారు. 'జీరో నుంచి హీరోగా మారిన పరిదా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం నమ్మలేకున్నాం' అని మరో నటుడు శ్రీతమ్‌ దాస్‌ పేర్కొన్నారు.

చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ

కాగా రాయ్‌మోహన్‌ పరిదా ఒడిశాలోని కియోంజర్‌ జిల్లాకు చెందినవారు. ఆయన సుమారు 100కుపైగా ఒడియా చిత్రాల్లో నటించారు. అలాగే 15 బెంగాలీ సినిమాల్లో కూడా అలరించాడు. రాయ్‌మోహన్‌ పరిదా ఎక్కువగా నెగెటివ్‌ రోల్స్‌లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. అంతేకాకుండా రాయ్‌మోహన్‌ ప్రసిద్ధ థియేటర్‌ ఆర్టిస్ట్‌. రామ లక్ష్మణ్, ఆసిబు కేబే సాజీ మో రాణి, నాగ పంచమి, ఉదండి సీత, తూ తిలే మో దారా కహకు, రణ భూమి, సింఘ బహిని, కులానందన్, కంధేయి ఆఖిరే లుహా వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో రాయ్‌మోహన్‌ పరిదా నటించారు. 

చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్‌.. బాయ్‌ఫ్రెండ్‌ కామెంట్‌ ఏంటంటే ?

(మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి..
రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top