బుల్లితెర నటి ఆత్మహత్య.. 'ఐ లవ్‌ యూ సాన్‌' అంటూ సూసైడ్‌ నోట్‌

Odia TV Actress Rashmirekha Ojha Dies By Suicide In Bhubaneswar - Sakshi

సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రష్మీ రేఖ ఓజా జూన్‌ 18 రాత్రి ఆత్యహత్యకు పాల్పడింది. భువనేశ్వర్‌లోని గదసాహీ ప్రాంతానికి సమీపంలోని నాయపల్లిలో ఉన్న తన అద్దె ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. గత కొద్ది రోజులుగా ఈ ఇంట్లోనే రష్మీ అద్దెకు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇంటి యజమాని సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న గదిలో ఒక సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. అందులో తన మరణానికి ఎవరు కారణం కాదని తెలిపింది. ఇంకా 'ఐ లవ్‌ యూ సాన్' అని రాసుకొచ్చింది. 

అయితే 23 ఏళ్ల రష్మీ రేఖ కొన్నాళ్లుగా సంతోష్‌ అనే వ్యక్తితో  సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. రష్మీ మరణానికి సంతోష్‌ కారణమై ఉండొచ్చని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. 'శనివారం (జూన్‌ 18) రష్మీకి కాల్‌ చేస్తే లిఫ్ట్‌ చేయలేదు. తర్వాత తను చనిపోయినట్లు సంతోష్‌ మాకు చెప్పాడు. సంతోష్‌, రష్మీ భార్యాభర్తలుగా నివసిస్తున్నట్లు ఇంటి యజమాని చెప్పేంత వరకు ఆ విషయం మాకు తెలియదు.' అని రష్మీ రేఖ తండ్రి తెలిపారు. జగత్‌సింగ్‌పూర్‌ జిల్లాకు చెందిన రష్మీ 'కెమిటి కహిబి కహా' అనే ఒడియా సీరియల్‌తో గుర్తింపు పొందింది. 

చదవండి: సినిమా సెట్‌లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు
వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని స్థితిలో హీరోయిన్‌
మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్‌ హీరో నరేష్‌ !

లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా హిట్‌ లిస్ట్‌లో కరణ్‌ జోహార్‌..

మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకు సాగండి..
రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top