పాతికేళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్‌లోకి వెంకీ.. టైటిల్‌ ఇదేనా! | Sakshi
Sakshi News home page

25 ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్‌లోకి వెంకీ..సల్మాన్‌తో మూవీ.. టైటిల్‌ ఇదేనా!

Published Sun, Dec 12 2021 11:52 AM

Venkatesh Returns To Bollywood After 25 Years With Salman Khan Action Comedy - Sakshi

టాలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా మూవీస్ తో దుమ్మురేపుతున్నారు.మరోవైపు అగ్ర హీరోలు కూడా తిరిగి బీటౌన్ పయనమవుతున్నారు. ఇప్పటికే చిరు సైరాతో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చారు. నాగార్జున బ్రహ్మాస్త్రాలో నటిస్తున్నాడు. ఇప్పుడు వెంకీ వంతు వచ్చింది. ఏకంగా సల్మాన్ ఖాన్ తో కలసి మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు విక్టరీ.

పాతికేళ్ల క్రితం హిందీ సినీ పరిశ్రమలో వరుసగా సినిమాలు రిలీజ్ చేసాడు వెంకటేశ్‌. తెలుగులో హిట్టైన చంటి, యమలీల సినిమాలను అక్కడ అనారి, తక్ దీర్ వాలా లాంటి పేర్లతో రీమేక్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ వైపు చూడ లేదు వెంకీ. పాతిక ఏళ్ల తర్వాత వెంకీ దృష్టి ఇప్పుడు సడన్ గా బాలీవుడ్ పై పడింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న కొత్త చిత్రంలో వెంకీ కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి భాయ్‌జాన్‌ అనే టైటిల్‌ కూడా ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. 

మరో విశేషం ఏంటంటే ఈ సినిమా ఓ సూపర్ హిట్ చిత్రానికి అఫీసియల్ రీమేక్. 2014 కోలీవుడ్ సూపర్ హిట్ వీరమ్ కు అఫీషియల్ హిందీ రీమేక్ తెరకెక్కుతోంది భాయ్ జాన్. ఈ సినిమాలోనే సల్మాన్, వెంకీ కలసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. వీరమ్ తెలుగులో కాటమరాయుడు పేరుతో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఆడియెన్స్ కోసం కథలో మార్పులు చేర్పులు చేశారు. సల్మాన్ కు జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనుంది. వెంకీ కోసం సౌత్ నుంచి మరో కథానాయికకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు.

Advertisement
Advertisement