జూలై 18న 'వీడే మన వారసుడు' చిత్రం విడుద‌ల‌ | Veede Mana Varasudu Movie Release Date Locked | Sakshi
Sakshi News home page

జూలై 18న 'వీడే మన వారసుడు' చిత్రం విడుద‌ల‌

Jun 27 2025 4:39 PM | Updated on Jun 27 2025 4:39 PM

Veede Mana Varasudu Movie Release Date Locked

రైతుల జీవితాలపై ఆధారపడి రూపొందిన సందేశాత్మక చిత్రం ‘వీడే మన వారసుడు’. ఈ సినిమాలో రమేష్ ఉప్పు (RSU) హీరోగా నటించడమే కాకుండా ఈ ప్రాజెక్ట్‌కు కథ , స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు ,నిర్మాతతో పాటు  దర్శకత్వం కూడా ఆయనే వ్యవహరించాడు. ఇందులో రమేష్ ఉప్పు  (RSU)కు జోడిగా లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ న‌టించారు. అర్.ఎస్  ఆర్ట్స్ బ్యానర్ పై రూపోందిన ఈ చిత్రానికీ శ్రీమతి యు.రమాదేవి సమర్పకురాలుగా వ్యవహారిస్తున్నారు. సమ్మెట‌ గాంధీ, విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్, శిల్ప (వైజాగ్) కీలక పాత్రలు పోషించారు. జూలై 18న తెలుగు రాష్ట్రాల‌లో ఈ సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు.

తాజాగా ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చిత్రయూనిట్‌ను అభినందించారు. కుటుంబం, రైతుల పోరాటం, యువతపై మాదకద్రవ్యాల ప్రభావం వంటి అంశాలను సమర్థవంతంగా చిత్రీకరించినందుకు ప్రశంసలు లభించాయి. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌నిర్మాత రమేష్ ఉప్పు  (RSU) మాట్లాడుతూ.. 'స‌మాజానికి మంచి సందేశం అందిస్తుంది మా సినిమా. ఇందులోని భావోద్వేగాలు ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలిస్తాయి. సెన్సార్ బోర్డు స‌భ్యుల‌తో పాటు, ప్రీమియ‌ర్ షో చూసిన ప‌లువురు ప్ర‌ముఖులు సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించ‌డంతో మా న‌మ్మ‌కం మ‌రింత పెరిగింది. మా శ్ర‌మ‌కు మంచి సక్సెస్ అందుతుందనే నమ్మకం బ‌లంగా ఉంది. రైతుల కష్టాలను అర్థవంతంగా ఆవిష్కరించిన‌ ఈ కుటుంబ క‌థా చిత్రాన్ని థియేట‌ర్‌కు వెళ్లి చూడాల‌ని ప్రేక్ష‌కుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.' అని చెప్పారు. ఈ నెల 29న మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement