ఏం జరిగినా సరే.. చూసుకుందాం అంటూ సవాల్‌ విసిరిన వరుణ్‌ తేజ్‌ | Sakshi
Sakshi News home page

Operation Valentine Trailer: ఏం జరిగినా సరే.. చూసుకుందాం అంటూ సవాల్‌ విసిరిన వరుణ్‌తేజ్‌

Published Tue, Feb 20 2024 12:44 PM

Varun Tej Operation Valentine Trailer Out Now - Sakshi

వరుణ్‌తేజ్‌ హీరోగా ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌, రినైసెన్స్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమా మార్చి 1న విడుదల కానుంది. శక్తిప్రతాప్‌ సింగ్‌ హడా దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్‌ ముద్ద నిర్మాత. ఇందులో వరుణ్‌కి జోడీగా అందాల భామ, ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ మధ్యే ఫైటర్‌తో హృతిక్ రోషన్ హిట్‌ కొట్టాడు.. తాజాగా విడుదలైన ట్రైలర్‌ చూస్తుంటే వరుణ్‌ హిట్‌ కొట్టడం ఖాయం అని చెప్పవచ్చు. 2019 ఫిబ్రవరి 14న  పుల్వామాలో భారత జవాన్లపై ఉగ్రవాదుల దాడి జరిగింది. ఆ సమయంలో సుమారు 40కి పైగా మన సైనికులు మరణించారు. ఆ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదులపై ఎలాంటి ఎటాక్‌ చేసింది అనేదే వాలెంటైన్‌ చిత్రం.

ఈ సినిమాతో వరుణ్‌ బాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అందుకు ఈ చిత్రంలో భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయి. ఇందులో  రుహానీ శర్మ కీలక పాత్రలో కనిపించింది.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా ఆమె అదరగొట్టేసిందని చెప్పవచ్చు. గాల్లో వారిద్దరూ చేసే విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్‌లో మాస్‌ ఆడియన్స్‌తో పాటు దేశభక్తిని రగిలించే డైలాగ్స్‌ ఉన్నాయి. సుమారు 3 నిమిషాల పాటు ఉన్న ట్రైలర్‌ ప్రేక్షకులను ఎక్కడా కూడా నిరాశ పరచదు. ట్రైలర్‌ను చూస్తే.. మార్చి 1న రిలీజ్ కానున్న ఈ సినిమా హిట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement