ఇటలీ ఫ్లైటెక్కిన లావణ్య-వరుణ్..! | Varun Tej Lavanya Tripathi Flight Off To Wedding In Tuscany For Italy | Sakshi
Sakshi News home page

Varun Tej -Lavanya Tripathi: ఎయిర్‌పోర్ట్‌లో కాబోయే జంట.. ఇటలీ బయలుదేరిన లావణ్య-వరుణ్..!

Published Fri, Oct 27 2023 3:26 PM | Last Updated on Fri, Oct 27 2023 3:38 PM

Varun Tej Lavanya Tripathi Flight Off To Wedding In Tuscany For Italy - Sakshi

మెగా ఇంట్లో పెళ్లిసందడి అంతా సిద్ధమైంది. ఇప్పటికే రామ్ చరణ్-ఉపాసన ఇటలీలో మకాం వేశారు. నాగబాబు తనయుడు, మెగాహీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుక ఇటలీలోని టుస్సానీలో జరగనుంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. నవంబర్‌ ఒకటో తేదీన ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒ‍క్కటి కానున్నారు.

(ఇది చదవండి: వరుణ్‌తేజ్‌- లావణ్యల శుభలేఖ ఫోటో చూశారా? ఆరోజే రిసెప్షన్‌!)

తాజాగా పెళ్లి షాపింగ్ పూర్తి చేసుకుని ఇటలీ ఫ్లైట్ ఎక్కారు వరుణ్-లావణ్య. శుక్రవారం ఉదయం డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనున్న టుస్సానీకి బయలుదేరారు. ఇప్పటికే నిహారికతో పాటు మెగా కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పెళ్లి తర్వాత రిసెప్షన్‌ మాత్రం హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. రిసెప్షన్‌కు సంబంధించిన శుభలేఖ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.  మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ హాలులో రాత్రి ఏడు గంటలకు రిసెప్షన్‌ ప్రారంభం అవుతుందని శుభలేఖలో అచ్చు వేయించారు. ఈ ఆహ్వాన పత్రికలో చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, రామ్‌ చరణ్‌ పేర్లను ముద్రించారు.  కాగా.. వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ డిసెంబర్‌లో రిలీజ్ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement