వరుణ్‌తేజ్‌- లావణ్యల శుభలేఖ ఫోటో చూశారా? ఆరోజే రిసెప్షన్‌! | Varun Tej And Lavanya Tripathi Wedding Invitation Goes Viral | Sakshi
Sakshi News home page

Varun Tej, Lavanya Tripathi: లావణ్య మెడలో మూడు ముళ్లు వేయనున్న వరుణ్‌ తేజ్‌.. పెళ్లి, రిసెప్షన్‌ ఎప్పుడంటే?

Oct 26 2023 5:56 PM | Updated on Oct 27 2023 12:03 PM

Varun Tej, Lavanya Tripathi Wedding Invitation Goes Viral - Sakshi

ఇకపోతే వీరి పెళ్లి నవంబర్‌ 1న ఇటలీలోని టుస్కానీలో జరగనుండగా రిసెప్షన్‌ మాత్రం హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ హాలులో రాత్రి ఏడు గం

ఆపరేషన్‌ వాలంటైన్‌ ముగిసింది. ఆపరేషన్‌ పెళ్లి మిగిలింది.. మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం ఆపరేషన్‌ వాలంటైన్‌. ఈ సినిమా షూటింగ్‌ను వారం రోజుల కిందటే పూర్తి చేశాడు వరుణ్‌. ఇప్పుడు తన పెళ్లి పనుల మీద పడ్డాడు. ఇప్పటికే లావణ్యతో కలిసి షాపింగ్‌ పూర్తి చేశాడు. చివరి నిమిషంలో తమ డ్రెస్‌లు సరిగా ఫిట్‌ అవుతున్నాయో, లేదో మరోసారి చెక్‌ చేసుకున్నారు.

ఇకపోతే తాజాగా వీరి శుభలేఖకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వరుణ్‌, లావణ్య.. ఇద్దరి పేర్లలోని తొలి అక్షరాలు V,Lలను కార్డు పై భాగంలో డిజైన్‌ చేశారు. కార్డు లోపల వరుణ్‌ నానమ్మ-తాతయ్యల పేర్లు పెట్టారు. 

దాని కింద భాగంలో చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, రామ్‌ చరణ్‌ పేర్లను ముద్రించారు. ఇకపోతే వీరి పెళ్లి నవంబర్‌ 1న ఇటలీలోని టుస్కానీలో జరగనుండగా రిసెప్షన్‌ మాత్రం హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ హాలులో రాత్రి ఏడు గంటలకు రిసెప్షన్‌ ప్రారంభం అవుతుందని శుభలేఖలో అచ్చు వేయించారు.

చదవండి: వెంకటేశ్‌ కూతురి నిశ్చితార్థం.. చిరంజీవి, మహేశ్‌ బాబు హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement