వరుణ్‌తేజ్‌ 'గని' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Varun Tej Ghani Will Release On July 30 - Sakshi

మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ బాక్సర్‌గా నటిస్తున్న తాజా చిత్రం 'గని'. నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి డైరెక్షన్‌ చేస్తున్నాడు. దేశంలో బాక్సర్లు ఎదుర్కొంటున్న సమస్యలను చూపిస్తూనే ఓ సందేశాన్ని ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. హీరో వరుణ్‌తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా  జనవరి 19వ తేదీన ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. బాక్సింగ్‌ రింగ్‌లో పంచులు కొడుతున్న వరుణ్‌ లుక్‌ అభిమానులను ఎంతగానో అలరించింది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఎప్పుడన్న విషయాన్ని చిత్రయూనిట్‌ వెల్లడించింది. (చదవండి: వరుణ్‌ తేజ్‌ ప్రత్యేకత ఇదే)

జూలై 30న గని రింగులో దిగబోతున్నాడని స్పష్టం చేసింది. ఈ సినిమాలో వరుణ్‌ తండ్రిగా ఉపేంద్ర, కోచ్‌గా సునీల్‌ శెట్టి, ప్రతినాయకుడిగా జగపతిబాబు కనిపించనున్నారు. బాలీవుడ్‌ దర్శకనటుడు మహేష్‌ మంజ్రేకర్‌ కూతురు సయూ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగు పెడుతోంది. నవీన్‌ చంద్ర ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇక వరుణ్‌తేజ్‌ మరోవైపు విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఎఫ్‌3లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల మందుకు రాబోతుంది.  (చదవండి: ‘ఎఫ్‌ 3’లో మూడో హీరో.. దర్శకుడి క్లారిటీ)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top