వరుణ్‌తో ప్రేమ.. నిహారికతో స్నేహం.. ముందే హింట్‌ ఇచ్చిన లావణ్య త్రిపాఠి | Varun Tej And Lavanya Tripathi's Love Story | Sakshi
Sakshi News home page

వరుణ్‌తో ప్రేమ.. నిహారికతో స్నేహం.. ముందే హింట్‌ ఇచ్చిన లావణ్య త్రిపాఠి

Nov 1 2023 9:12 AM | Updated on Nov 1 2023 9:38 AM

Varun Tej And Lavanya Tripathi Love Story - Sakshi

పేరుకు తగ్గ రూపం లావణ్య త్రిపాఠి సొంతం. ఆమెలోని సౌందర్యం, శరీరకాంతి ఇట్టే చూపరులను ఆకర్షిస్తాయి. తెలుగు సినిమా ప్రేక్షకులకు 'అందాల రాక్షసి'తో దగ్గరైనా జనం మదిలో ఆ సినిమా టైటిల్‌గానే నిలచిపోయింది. ఇప్పటికీ ‘లావణ్య’ అనగానే ‘అందాల రాక్షసి’ అనే అంటుంటారు.  ‘నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్నా..’ అంటూ ‘అందాల రాక్షసి’లో అమాయకంగా అడుగుతుంటే ఆ అమ్మాయిని చూసి అందరూ భలే ముచ్చటపడ్డారు.

అలాగే ఆరడుగుల అందగాడు మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌.. తెరపై వీరిద్దరూ జంటగా రొమాన్స్‌ పండించడం ఆపై ప్రమలో పడి దానిని సుమారు ఏడేళ్ల పాటు రహస్యంగా దాచి నిశ్చితార్థంతో అందరికీ షాకిచ్చారు. అలా ప్రపంచంలోనే ది బెస్ట్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌గా పేరు పొందిన ఇటలీలోని టస్కనీ వీరి పెళ్లికి వేదికైంది. మరి కొన్ని గంటల్లో ఈ జంట ఒకటి కానుంది. నేడు నవంబర్‌ 1న మధ్యాహ్నం 2:48 గంటలకు వరుణ్‌- లావణ్య భార్యభర‍్తలు కానున్న సందర్భంగా వారి ప్రేమ గురించి కొన్ని విషయాలు.

లవ్‌ ప్రపోజ్‌ ముందుగా ఎవరు చేశారంటే
2017లో ‘మిస్టర్‌’ సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా సమయంలో ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ సినిమా కూడా ఇటలీలోనే షూటింగ్‌ జరుపుకుంది. వీరి ప్రేమకు మొదటి అడుగు పడింది కూడా ఇటలీలోనే... విస్టర్‌ సినిమా తర్వాత   ‘అంతరిక్షం’లో కలిసి నటించారు. మిస్టర్‌ సినిమాతో పరిచయం అయిన వారి స్నేహం అంతరిక్షంలో మనుసులు కలిశాయి. అలా వరుణ్‌ జీవితంలో ఇష్టమైన రోజుగా లావణ్య పుట్టినరోజు కూడా చేరిపోయింది. ఆ  సందర్భంగా తన ఇష్టసఖికి ప్రేమ ప్రతిపాదన చేశానని ఓ ఇంటర్వ్యూలో వరుణ్‌ చెప్పాడు. తన లవ్‌ ప్రపోజల్‌ను మొదటగా వరుణ్‌ తేజ్‌నే లావణ్యతో చెప్పాడు. ఆ తర్వాత ఇరు కూటుంబాలు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాయి.

అయోధ్యలో జన్మించిన లావణ్య టాలీవుడ్‌కు ఎలా వచ్చింది?
లావణ్య త్రిపాఠి 1990 డిసెంబర్ 15న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఆమె తండ్రి లాయర్. తల్లి టీచర్. డెహ్రాడూన్ లో లావణ్య విద్యాభ్యాసం సాగింది. ముంబయ్ లో రిషీ దయారామ్ నేషనల్ కాలేజ్ లో ఎకనామిక్స్ లో లావణ్య త్రిపాఠి డిగ్రీ పూర్తి చేశారు. ముంబయ్ లో చేరినప్పటి నుంచే లావణ్యకు ‘షో బిజ్’లో అడుగు పెట్టాలనే అభిలాష కలిగింది. అందుకు అనువుగానే అడుగులు వేసింది. భరతనాట్యంలో శిక్షణ పొందిన లావణ్య త్రిపాఠి అనువైన చోట నాట్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంటుంది. ముందుగా “సిఐడి, ప్యార్ కా బంధన్” వంటి టీవీ సీరియల్స్ లో లావణ్య నటించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ‘అందాల రాక్షసి’ చిత్రంతో లావణ్య తొలిసారి బిగ్ స్క్రీన్ కు పరిచయం అయింది. 

వరుణ్‌తో ప్రేమ.. నిహారికతో స్నేహం.. గడుసు పిల్లే
మిస్టర్‌ సినిమా 2017లో విడుదలైంది.. ఆ సమయంలో లావణ్యతో వరుణ్‌ స్నేహం ప్రారంభం కావడం అది ప్రేమగా రూపుదిద్దుకోవడం జరిగిపోయింది. ప్రస్తుతం సినీ ప్రపంచంలో పలాన హీరో,హీరోయిన్లు ప్రేమలో ఉన్నారని ఎన్నో వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. కానీ వరుణ్‌- లావణ్య సుమారు ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నప్పటికీ ఎక్కాడా కెమెరాల కంటికి చిక్కింది లేదు.. అలా ఎంతో రహస్యంగా తమ ప్రేమను ఉంచారు ఈ బ్యూటీఫుల్‌ కపుల్స్‌. వరుణ్‌తో పరిచయం ఆపై నిహారికతో స్నేహం ఇలా లావణ్యకు కలిసొచ్చిందని చెప్పవచ్చు.

అలా నిహారిక- లావణ్య ఇద్దరూ మంచి స్నేహితులు అయ్యారు.. వారిద్దరూ ఒకే జిమ్‌కు వెళ్తుంటారు కూడా.. అలా వారు ఎన్నో పార్టీలే కాకుండా మెగా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా లావణ్య కనిపించేది.. ఉదయ్‌పూర్‌లో జరిగిన నిహారిక పెళ్లికి కూడా లావణ్య హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే.  ఆ సమయంలో వరుణ్‌తో కూడా ఫోటోలు దిగింది. కానీ ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఆమె ఎంతో జాగ్రత్త పడేది అని అర్థమౌతుంది.

పలు ఇంటర్వ్యూలలో టాలీవుడ్‌లో ఇష్టమైన హీరో ఎవరనే ప్రశ్న లావణ్యకు ఎదురైంది.. అందుకు తడుముకోకుండా వరుణ్‌ అంటే ఇష్టమని చెప్పింది.. ఒక సినిమా వేదికపై తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకోమని సరదాగా  అల్లు అరవింద్‌ అంటే అప్పుడు కూడా నవ్వుతూ సరే అని సమాధానం ఇస్తుంది. ఇలా పలు సందర్భాల్లో వరుణ్‌ ప్రేమపై పలు క్లూస్‌ ఇచ్చినా  ఏ మాత్రం ఇతరులకు చిక్కకుండా జాగ్రత్తపడ్డారు. ఏదేమైనా ఈ సొట్టబుగ్గల సుందరి గడుసు పిల్లే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement