బిగ్‌బాస్ ఓ చెత్త షో.. తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్! | Varudu Movie Actress Bhanu Sri Mehra Comments On Bigg Boss Show | Sakshi
Sakshi News home page

Bigg Boss: బిగ్‌బాస్‌పై 'వరుడు' హీరోయిన్ కాంట్రవర్సీ స్టేట్‌మెంట్

Oct 31 2023 9:33 AM | Updated on Oct 31 2023 10:20 AM

Varudu Movie Actress Bhanu Sri Mehra Comments On Bigg Boss Show - Sakshi

బిగ్‌బాస్ మీద ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోర్టులు, కేసులు, గొడవలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి ఏం డిస్కస్ చేయడం లేదులేండి. అదే టైంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ షో ఓ మాదిరి క్రేజ్ సంపాదించింది. అలాంటిది ఇప్పుడీ షోపై తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

(ఇదీ చదవండి: ప్రేమలో పడిన మరో తెలుగు హీరోయిన్.. త్వరలో పెళ్లి!)

అల్లు అర్జున్ 'వరుడు' సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టిన భానుశ్రీ మెహ్రా.. ఆ తర్వాత కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది. డింగ్ డాంగ్ బెల్, గోవిందుడు అందరివాడేలే, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, అలా ఎలా?, రన్, మిస్ ఇండియా, 10th క్లాస్ తదితర తెలుగు చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేసింది. ఇవేవి ఈమెకు గుర్తింపు తీసుకురాలేకపోయాయి. రీసెంట్‌గా  వచ్చిన 'లియో'లోనూ కనీకనిపించని పాత్రలో నటించింది.

అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఈ బ్యూటీ ఇప్పుడు బిగ్‌బాస్‌పై విరుచుకుపడింది. 'బిగ్‌బాస్ షోని జనాలు ఎలా చూస్తున్నారా అని నేను ఇప్పటికీ ఆశ్చర్యపోతుంటాను. దానికి తోడు ఎప్పటికప్పడు కొత్త సీజన్స్ వస్తూనే ఉన్నాయి. నా దృష్టిలో ఇది ఓ చెత్త షో. నా ఇన్‌స్టా ఫీడ్ అంతా కూడా బిగ్‌బాస్ వీడియోలతో నిండిపోతోంది' అని భానుశ్రీ తన ట్విట్టర్‌లో షోపై కోపాన్నంతా బయటపెట్టింది. ఇది హిందీ షోని ఉద్దేశించి చెప్పినప్పటికీ.. మిగతా భాషల షోలకు ఇది వర్తిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement