List of Telugu Movies Streaming on OTT This Week - Sakshi
Sakshi News home page

OTT Movies: ఒకే రోజు ఓటీటీకి మూడు కొత్త సినిమాలు, ఉదయం నుంచే స్ట్రీమింగ్‌

Jan 7 2022 1:19 PM | Updated on Jan 7 2022 8:47 PM

Varudu Kaavalenu And Lakshya Movies Streaming On OTT With Pushpa Movie - Sakshi

సంక్రాంతి సందర్భంగా డిజిటల్‌ ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీలోకి కొత్త సినిమాలు వచ్చాయి. ఈరోజు(జనవరి 7) ఓటీటీలో ఏకంగా మూడు సినిమాలు విడుదల కావడం విశేషం. వీటీలో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప' నేడు రాత్రి 8 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే.

చదవండి: భార్యకు కరోనా, అయినా ఆమె బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌..

ఈ మూవీతో పాటు ఓటీటీలోకి మరో యంగ్‌ హీరో నాగశౌర్య కొత్త సినిమాలు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. నాగశౌర్య 2021లో నటించిన ‘వరుడు కావలెను,  ‘లక్ష్య’ చిత్రాలు నేటి(జనవరి 7) ఉదయం నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. జీ5 ఓటీటీలో 'వరుడు కావలెను'... ఆహాలో 'లక్ష్య' స్ట్రీమింగ్ ప్రారంభమయింది. ఒకే రోజున మూడు సినిమాలు ఓటీటీలో విడుదల కావడంతో సినీ అభిమానుల వినోదం మరింత రెట్టింపయ్యింది. 

చదవండి: ప్రకాశ్‌ రాజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్‌ కృష్ణవంశీ

Advertisement
 
Advertisement
Advertisement